అమరావతి (Amaravati) పరిధిలోని పరిధిలోని ఉండవల్లి సెంటర్లో(Undavalli Center) నిన్న జరిగిన ఉద్రిక్త పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. వైసీపీ(YSRCP) నేతలు, సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ (CRDA Farmers Protection Committee)సభ్యుల పర్యటన సందర్భంగా వారిపై టీడీపీ(TDP) శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్‌కు (Police Constable) తీవ్ర గాయాలు కాగా, వైసీపీ నేతలకు సంబంధించిన పలు కార్లు (Cars) ధ్వంసమయ్యాయి. దాడికి సంబంధించిన స్పష్టమైన వీడియో విజువల్స్, ఆధారాలు బయటపడినప్పటికీ.. పోలీసులు బాధితులైన వైసీపీ నేతలపైనే కేసులు నమోదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య బద్ధంగా కాకుండా ‘రెడ్‌బుక్ రాజ్యాంగం'(Red Book Constitution) నడుస్తోందనడానికి ఈ ఉదంతమే ప్రత్యక్ష సాక్ష్యమని రాజకీయ విశ్లేషకులు, బాధితులు మండిపడుతున్నారు. దాడికి పాల్పడిన అధికార పార్టీ శ్రేణులు దర్జాగా ఉన్నారు. దాడికి గురైన మాజీ మంత్రులు, సీనియర్ నాయకులపై తాడేపల్లి పోలీసులు కేసులు నమోదు చేయడం శోచనీయం. వైసీపీ నేతలపై మొత్తం రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి.
తమకు అన్యాయం జరుగుతుందని, తమ భూములు(Lands) ప్రభుత్వం (Government) లాగేసుకుంటుందన్న పెనుమాక రైతుల (Penumaka Farmers) ఫిర్యాదు అభ్యర్థన మేరకు సీఆర్డీయే(CRDA) రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు పెనుమాక బయల్దేరారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, డైమండ్ బాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పెనుమాక రైతు శివారెడ్డి, నూనె ఉమామహేశ్వర్ రెడ్డి, మరికొంతమందిని ఉండవల్లి వద్దే టీడీపీ శ్రేణులు అడ్డుకొని బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. రాళ్ల దాడిలో వైసీపీ నేతల కార్లు ధ్వంసం కాగా, కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన వారు మంత్రి లోకేష్ సన్నిహితులని వైసీపీ ఆధారాలను సైతం బయటపెట్టింది.
ఇదిలా ఉంటే.. దాడిచేసిన వారిని వదిలేసి, తమ విధులకు ఆటంకం కలిగించారని వైసీపీ నేతలపైనే కేసు నమోదైంది. తాడేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) పురిమెట్ల వీరేంద్రబాబు (Purimetla Veerendrababu) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రులు, వైసీపీ నేతలు, పెనుమాక రైతులపై కేసు నమోదు చేశారు. 189(2), 115(2), 118(1), 131, 351(2), 79, 190 బిఎన్ఎస్, SC ST Act లోని 3(1)(r), 3(1)(s), 3(2) కింద కేసు ఫైల్ చేశారు. అదే విధంగా 223, 132, 3(5) పోలీస్ యాక్ట్ 1861 లోని సెక్షన్ 30, 30(a) కింద ఈ కేసు నమోదు చేశారు.
కోర్టులు, గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్
వీడియో ఆధారాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నా.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు అధికారే స్వయంగా అధికార పార్టీ ఒత్తిళ్లతో బాధితులపై కేసు నమోదు చేయడం ఏంటని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఈ అప్రజాస్వామిక విధానాలపై న్యాయస్థానాలు, రాష్ట్ర గవర్నర్ (Governor) తక్షణమే జోక్యం చేసుకుని నిష్పక్షపాత విచారణ జరిపించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.









బీరు హెల్దీ డ్రింకా?.. ‘బీచ్ షాక్స్’ కోసం నేతల తిప్పలు