ఐసీసీ (ICC) మహిళల టీ20 (Women’s T20) ప్రపంచకప్ 2026లో (World Cup 2026) వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత (India) మహిళల జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కీలక ఆఫ్‌స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ (Shreyanka Patil) గాయం కారణంగా టోర్నీ మొత్తం నుంచి వైదొలిగింది. నెదర్లాండ్స్‌తో (Netherlands) జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా కుడి కాలి మడమకు (Right Leg Ankle) గాయమైన శ్రేయాంక.. వైద్య పరీక్షల అనంతరం మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండదని తేలింది. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన మ్యాచ్ విన్నర్ దూరం కావడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది.
శ్రేయాంక స్థానంలో యువ స్పిన్నర్ ప్రేమా రావత్‌కు (Prema Rawat) ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. ఐసీసీ టెక్నికల్ కమిటీ ఈ మార్పుకు ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు భారత సీనియర్ జట్టుకు ఆడని ప్రేమా.. దేశవాళీ క్రికెట్, ఇండియా-ఏ ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఆర్సీబీ తరఫున డబ్ల్యూపీఎల్‌లో (WPL) ఆడిన అనుభవం ఉన్న ఆమెకు ఇప్పుడు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం లభించింది. కీలక దశలో భారత్ ఈ లోటును ఎలా భర్తీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.









బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర