తాడిపత్రిలో జేసీ హైడ్రామా.. పీఎస్ ఎదుటే స్నానం (Video)

తాడిపత్రిలో జేసీ హైడ్రామా.. పీఎస్ ఎదుటే స్నానం (Video)

అనంతపురం జిల్లా (Anantapur District) తాడిపత్రి నియోజకవర్గంలో (Tadipatri Constituency) రాజకీయం మరోసారి వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ (Tadipatri Town Police Station) వద్ద హైడ్రామా సృష్టించారు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై (Kethireddy Peddareddy) కేసులు నమోదు చేయాలంటూ నడిరోడ్డుపై, పోలీస్ స్టేషన్ ముందే స్నానం చేసి ఆయన వినూత్న నిరసనకు దిగడం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది.

తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వేచ్ఛగా పర్యటించవచ్చని, ఆయన పర్యటనలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదని ఇటీవల గౌరవ హైకోర్టు (High Court) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్లుగా పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వ‌కుండా అడ్డుకుంటున్న జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి.. ఈసారి పెద్దారెడ్డికి కోర్టు అనుమ‌తి ఉండ‌డంతో తన అనుచరులను రంగంలోకి దించాడు జేసీ. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కోర్టు నిబంధ‌న‌ల‌ను క్రాస్ చేశాడ‌ని తన అనుచరులతో పోలీసుల‌కు ఫిర్యాదులు చేయించాడు. ఆ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి పోలీస్ స్టేషన్ వద్ద జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి హంగామా చేశాడు.

పోలీస్ స్టేషన్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రదర్శించిన వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టేషన్ ముందే నడిరోడ్డుపై (Main Road)కూర్చుని, అక్కడే స్నానం (Bath) చేస్తూ పోలీసు యంత్రాంగంపై ఆరోపణలు గుప్పించాడు. చివరకు జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన తీవ్ర ఒత్తిడితో స్థానిక పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు (Illegal Cases) బనాయించడం ప్రజాస్వామ్య విరుద్ధమని (Against Democracy) వైసీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment