ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ ప్లేఆఫ్స్ రేసు (Playoffs Race) ఉత్కంఠభరితంగా ముగిసింది. చివరి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టు ముంబై ఇండియన్స్‌పై (Mumbai Indians) కీలక విజయం సాధించి ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు టాప్-4లో స్థానం ఖాయం చేసుకున్నాయి. దీంతో ఈసారి ప్లేఆఫ్స్ పోరు మరింత హై వోల్టేజ్‌గా మారింది. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్లు లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో వారి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఇప్పటికే ప్లేఆఫ్స్ షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నెల 26న జరిగే తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో బెంగళూరు-గుజరాత్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ విజేత నేరుగా ఫైనల్‌కు చేరుకోనుంది. ఇక మే 27న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్-రాజస్థాన్ (Hyderabad-Gujarat) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నేరుగా బయటపడనుండటంతో అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఈసారి టైటిల్ రేసులో బెంగళూరు, హైదరాబాద్, గుజరాత్ జట్లు బలంగా కనిపిస్తుండగా.. రాజస్థాన్ డార్క్ హార్స్‌గా మారింది.








