“ఎక్కువ మంది పిల్లలను కనండి.. జనాభాను పెంచండి” అంటూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఇటీవల ఇచ్చిన పిలుపు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నరసన్నపేట సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మూడో సంతానానికి రూ. 30 వేలు, నాలుగో సంతానానికి రూ. 40 వేలు చొప్పున ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల కంటే ఎక్కువగా సామాన్య ప్రజలు, మహిళా లోకం(Women Community), సినీ-రాజకీయ ప్రముఖుల నుండి ఊహించని స్థాయిలో కౌంటర్లు, సెటైర్లు పేలుతున్నాయి.
మీ ఇంటి నుంచే ఎందుకు మొదలుకాకూడదు?
చంద్రబాబు ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల నుండి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. “దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) (రూ.931 కోట్లు)కు ఒక్కడే సంతానం (లోకేష్). ఆయన కుమారుడు నారా లోకేష్‌కు(Nara Lokesh) కూడా ఒక్కడే సంతానం (దేవాన్ష్)(Devaansh). మరి చంద్రబాబు కుటుంబం మాత్రం ఒక్కొక్కరినే కంటూ ఆస్తులను, వారసత్వాన్ని కాపాడుకుంటుంది.. కానీ పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రం నలుగురిని కని దేశం కోసం పాటుపడమంటారా?” అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జనాభా పెరుగుదల (Population Growth) నినాదం చంద్రబాబు స్వగృహం నుంచే ఎందుకు మొదలుకాకూడదని, సీఎం నినాదాన్ని లోకేష్ ఆచరించిన తరువాత జనానికి ఇలాంటి పిలుపులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
పిల్లలను కనడానికి వేలం పాటలా?
వైసీపీ(YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “పిల్లలను కనడానికి చంద్రబాబు బాహాటంగా వేలం పాటలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్(Lokesh) మాత్రం ఒక్కొక్కరినే కన్నారు.. రేపు దేవాన్ష్ (Devaansh) కూడా ఒకరినే కంటారు. కానీ పేద ప్రజలు మాత్రం ముగ్గురిని, నలుగురిని కనాలా? ఇది ఏ రకమైన న్యాయం?” అని ఆయన నిలదీశారు.
ఆ డబ్బు డైపర్లకైనా సరిపోతుందా?
సీపీఐ(CPI) జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) తనదైన శైలిలో చంద్రబాబుపై మండిపడ్డారు. “పిల్లలను కనడానికి ప్రజలేమైనా యంత్రాలా? ప్రభుత్వం ఇచ్చే ఆ 30 వేలు, 40 వేల రూపాయలు కనీసం పిల్లల డైపర్లకైనా సరిపోతాయా? ఒకవేళ నిజంగానే జనాభా పెంచాలనుకుంటే.. మూడో బిడ్డ, నాలుగో బిడ్డ పూర్తి పోషణ బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుందని ముందుగా క్యాబినెట్లో తీర్మానం చేయాలి. ఆ తర్వాతే ఇలాంటి మాటలు మాట్లాడాలి” అని హితవు పలికారు.
లోకేష్‌తోనే మొదలుపెడదాం – నటి పూనమ్
ఈ వివాదంలోకి సినీ పరిశ్రమ కూడా చేరింది. నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) ఈ అంశంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ముందున్న ఆర్థిక అనిశ్చితి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని.. జనాభా పెంచే ప్రక్రియను నారా లోకేష్‌తోనే(Nara Lokesh) మొదలుపెడదాం. లోకేష్‌కే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని మనం భావిద్దాం” అంటూ ఆమె ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు.

మహిళలారా మేల్కొనండి – కిరణ్ బేడీ
చంద్రబాబు నిర్ణయంపై దేశంలోనే మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది పిల్లలను కనాలనే నిర్ణయాన్ని ప్రభుత్వాలు ఎలా శాసిస్తాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇంటిని, ఆఫీస్ పనిని సమతుల్యం చేసుకుంటూ మహిళలు తమ వృత్తిని, ఆశయాలను, సొంత జీవితాన్ని నిర్మించుకుంటున్నారు. అలాంటిది ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది? అసలు ఎంతమంది పిల్లలను కనాలనేది కేవలం మహిళల వ్యక్తిగత నిర్ణయం. మహిళలారా.. మేల్కొనండి!” అంటూ కిరణ్ బేడీ ట్వీట్ చేయడం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది.

సంతానోత్పత్తిపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చివరకు ఆయన కుటుంబానికే ఎదురుతిరిగేలా మారాయి. తాను ఆచరించి, తరువాత బోధనలు చేస్తే బాగుంటుందనే డిమాండ్లు పెరుగుతున్నాయి. మరి ప్రజల నుంచి వస్తున్న ఈ విమర్శలపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో చూడాలి.








