ఏసీపీ ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్‌.. వ్యక్తికి తీవ్ర‌ గాయాలు (Video)!

ఏసీపీ ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్‌.. వ్యక్తికి తీవ్ర‌ గాయాలు!

విజయవాడలోని (Vijayawada) పటమట ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. స్థానిక ప్రత్యూష అపార్ట్‌మెంట్‌లో(Prathyusha Apartment) జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు (Gas Cylinder Blast) ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఈ ప్రమాదంలో అపార్ట్‌మెంట్ గోడలు కూలిపోగా, ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సిలిండ‌ర్ బ్లాస్ట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

పటమటలోని ప్రత్యూష అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నంబర్ 302లో నివాసం ఉంటున్న ఏసీపీ (ACP ) సత్యానందం (Satyanandam) (1991 బ్యాచ్) ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. సత్యానందం ప్రస్తుతం వీఆర్ (VR) లో ఉన్నారు. ప్రమాద సమయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంట్లో ఉండ‌డంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ముందుగా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ (Short Circuit) సంభవించి మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు వ్యాపించి గ్యాస్ సిలిండర్‌కు తగలడంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు ధాటి ఎంత తీవ్రంగా ఉందంటే, ఫ్లాట్‌కు సంబంధించిన గోడ కూలి పక్కనే ఉన్న మరో వ్యక్తిపై పడింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. లేదంటే మంటలు అపార్ట్‌మెంట్‌లోని ఇతర ఫ్లాట్లకు వ్యాపించి భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment