గుజరాత్‌పై కీలక విజయం తర్వాత హార్దిక్ సంచలన వ్యాఖ్యలు

గుజరాత్‌పై కీలక విజయం తర్వాత హార్దిక్ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 2026లో గుజరాత్‌ టైటాన్స్‌పై (Gujarat Titans) కీలక విజయాన్ని సాధించిన అనంతరం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అహ్మదాబాద్ వంటి కఠినమైన వేదికపై గెలవడం ఎప్పుడూ సవాలేనని, కానీ ఈసారి జట్టు సమిష్టిగా మంచి క్రికెట్ ఆడిందని తెలిపాడు. ఈ విజయం ముంబై జట్టుకు ఎంతో అవసరమని, అందుకే మరింత ప్రత్యేకంగా అనిపిస్తోందని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో 14వ ఓవర్ టైమ్‌అవుట్ తర్వాత గట్టిగా అరిచానని, ఆ సమయంలో తల తిరిగిందని హార్దిక్ చెప్పుకోచ్చారు. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయాల అనంతరం ముంబై విజయం సాధించింది.

ఈరోజు మేము మంచి క్రికెట్ ఆడాం. ఈ విజయం చాలా అవసరం, అందుకే ఇది మరింత ప్రత్యేకంగా అనిపిస్తోంది. టైమ్‌అవుట్ సమయంలో నేను తిలక్ (Tilak Varma) గురించి ఆలోచించాను. అతనిలో ఉన్న ప్రతిభను చూస్తే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కెప్టెన్‌గా కూడా ఎనర్జీ చాలా మార్పు తీసుకొస్తుంది’ అని హార్దిక్ తెలిపాడు.

‘చాలామంది బుమ్రా (Bumrah) ఎందుకు మొదటి ఓవర్ వేయడు? అని అడుగుతుంటారు. బుమ్రా ఇప్పటికే చాలా మ్యాచ్‌లు ఆడాడు. అందులో కొన్ని సార్లు మాత్రమే తొలి ఓవర్ వేశాడు. ఇది హార్దిక్ సమస్య కాదు. బుమ్రా ఎంతో ప్రత్యేకమైన బౌలర్. జట్టుకు అవసరమైనప్పుడు ఎక్కడైనా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. జట్టుకు ఈ ఎనర్జీ చాలా అవసరం. డెబ్యూ చేసిన క్రిష్ బాగా బౌలింగ్ చేశాడు. అశ్వని అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. గతంలో కూడా అతడు మ్యాచ్ మోమెంటమ్ మార్చాడు ఈ విజయం మాకు మలుపు అవుతుంది’ అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment