షేక్ హసీనాను అప్పగించండి.. భారత్‌కు బంగ్లా రిక్వెస్ట్

షేక్ హసీనాను అప్పగించండి.. భారత్‌కు బంగ్లా రిక్వెస్ట్

Summarize with AI

బంగ్లాదేశ్‌లో ఏర్ప‌డిన మధ్యంతర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ప్రత్యేక అభ్యర్థనను పంపింది. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను త‌మ దేశానికి అప్పగించాలని కోరింది. బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

భారత్‌లో అమలులో ఉన్న ఖైదీల మార్పిడి ఒప్పందం ప్రకారం, షేక్ హసీనాను అప్పగించాల్సిందిగా బంగ్లాదేశ్ కోరింది. ఆమె ప‌రిపాలనా కాలంలో జరిగిన అల్లర్లు, హత్య కేసులలో అభియోగాలు నమోదు కావడంతో, న్యాయపరమైన ప్రక్రియను కొనసాగించడమే ఈ అభ్యర్థన లక్ష్యంగా ఉందని సలహాదారు తెలిపారు.

బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల కారణంగా.. 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికి షేక్ హసీనా ఆగస్టు 5వ తేదీన ఆ దేశాన్ని వీడింది. నేరుగా భారత్ కు వచ్చి ఆమె ఆశ్రయం పొందుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment