వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డికి బెయిల్

వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డికి బెయిల్

వైసీపీ (YSRCP) అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి (Karumuri Venkata Reddy)కి తాడిపత్రి కోర్టు (Tadipatri Court)లో ఊర‌ట ల‌భించింది. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి తాడిప‌త్రి కోర్టు ఎదుట పోలీసులు వెంక‌ట‌రెడ్డిని హాజ‌రుప‌ర్చ‌గా, పోలీసులు నమోదు చేసిన కేసులో రిమాండ్‌ను కొట్టేసిన కోర్టు, సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో వైసీపీకి భారీ ఊర‌ట ల‌భించింది.

కోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది (Senior Lawyer) హరినాథ్ రెడ్డి (Harinath Reddy), “ప్రాథమిక విచారణ లేకుండానే కారుమూరిని పోలీసులు అరెస్ట్ చేశారు” అని వాదించారు. ఈ వాదనలను పరిశీలించిన కోర్టు, వెంటనే సొంత పూచీకత్తుపై బెయిల్ (Bail) మంజూరు చేసింది.

టీటీడీ విజిలెన్స్ (TTD Vigilance) మాజీ అధికారి సీఐ సతీష్ కుమార్ (CI Satish Kumar) మృతి పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపణలతో కారుమూరిని నిన్న హైదరాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని ఆయ‌న నివాసంలో అరెస్ట్ చేసి గుంత‌క‌ల్లు తీసుకువ‌చ్చారు. గుంత‌క‌ల్లు డీఎస్పీ ఆఫీస్‌లో రాత్రంతా విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు తాడిప‌త్రికి త‌ర‌లించి వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం కోర్టులో హాజ‌రుప‌రిచారు.

గుంత‌క‌ల్లు, తాడిప‌త్రి పోలీస్ స్టేష‌న్ల వ‌ద్ద‌కు వైసీపీ సీనియ‌ర్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. రాత్ర‌యినా వెంక‌టరెడ్డి కేసులో కోర్టు తీర్పు వ‌చ్చేంత వ‌ర‌కు అక్క‌డే ఉన్నారు. కోర్టు వద్ద వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు కోర్టు వద్ద ఉండి మద్దతు తెలిపారు.

వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. వెంకటరెడ్డికి బెయిల్ మంజూరును స్వాగ‌తిస్తున్నామ‌న్నారు. “ఈ తీర్పు చంద్రబాబు సర్కార్‌కు చెంపపెట్టు. అక్రమ కేసులతో వైసీపీ నేతలను వేధించడం బాధాకరం. భావప్రకటన స్వేచ్ఛను చంద్రబాబు సర్కార్ కాలరాస్తోంది” అని తీవ్రంగా విమర్శించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment