‘టాయ్ పార్క్‌’ క్రెడిట్ చోర్.. ఇదిగో మరో సాక్ష్యం! – వైసీపీ మరో బాంబ్

tdp-credit-theft-ycp-counter-evidence-visakhapatnam-cii-summit

విశాఖ (Visakhapatnam)లో జరుగుతున్న సీఐఐ సమ్మిట్ (CII Summit) నేపథ్యంలో పెట్టుబడుల విషయంపై టీడీపీ–వైసీపీ (TDP-YSRCP) మధ్య మాటల యుద్ధం వేడెక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) వరుసగా ఏపీ (Andhra Pradesh)కి భారీ కంపెనీలు వస్తున్నాయని ట్వీట్లు చేస్తూ ప్రచారం చేస్తుండగా, ఇవన్నీ వైఎస్ జగన్(YS Jagan) సీఎంగా ఉన్నప్పుడే రాష్ట్రానికి వచ్చిన కంపెనీలేనని వైసీపీ ఆధారాలు చూపిస్తూ కౌంటర్ ఇస్తోంది.

రెన్యూ ఎనర్జీ ప్రాజెక్టు (ReNew Energy Project) అంశంపై నిన్న నుండి ఇరు పార్టీల మధ్య భారీ రాజకీయ రగడ నెలకొంది. రెన్యూ పవర్‌ను గత ఐదేళ్లలో ఏపీలోకి రానివ్వలేదని నారా లోకేష్ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా, ఆ సంస్థకు సంబంధించిన 2023 భూకేటాయింపులు, జీవోలు, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో పాల్గొన్న వీడియోలను వైసీపీ బహిర్గతం చేసింది. జగన్ హయాంలో వచ్చిన కంపెనీలకే చంద్రబాబు ఈరోజు క్రెడిట్ తీసుకుంటున్నారని వైసీపీ స్పష్టం చేసింది.

ఇదే సమయంలో తాజా వివాదం టాయ్ పార్క్‌పై రేగింది. టాయ్ పార్క్‌ను తమ ప్రభుత్వం ఏపీకి తెచ్చిందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేయగా, ఆ ప్రాజెక్టు 2023లోనే వైఎస్ జగన్ హయాంలో 1,000 ఎకరాల్లో ప్రతిపాదించబడిందని వైసీపీ ఘాటుగా కౌంటర్ వేసింది. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను కొత్తవిగా చూపించుకుంటూ క్రెడిట్ దోపిడీ చేస్తోన్న చంద్రబాబు ఎన్ని రోజులు ఇలా ప్రజలను మభ్యపెడతారని ప్రశ్నించింది.

అదానీ డేటా సెంటర్ సహా అనేక దిగ్గజ కంపెనీలు గత ప్రభుత్వం సమయంలోనే ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, వాటిని ఇప్పుడు ‘మేమే తెచ్చాం’ అని చెప్పుకోవడం సిగ్గుచేటని వైసీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రాజెక్టులపై ఆధారాలు పెట్టినప్పటికీ, టీడీపీ మాత్రం సోషల్ మీడియాలో అబద్ధాల ప్రచారం ఆపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment