సినీరంగం (Film Industry)లో హీరోయిన్ (Heroine)గా రాణించడం అంత సులభం కాదు. అవకాశాలు ఉన్నా, వాటితో విజయం సాధించడం ఎంతో ముఖ్యం. కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలతోనే హిట్లు అందుకుని స్టార్‌లుగా మారిపోతుంటే, మరికొందరు తొలి చిత్రం (First Film)తోనే హిట్ (Hit) కొట్టినా ఆ తర్వాత అదృష్టం కలిసిరావడం లేదు. అలాంటి హీరోయిన్‌లలో ఒకరే ఈ ముద్దుగుమ్మ.
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు సినిమాలు తగ్గించి ఇతర వ్యాపారాల్లో (Businesses) బిజీ అయ్యారు. మరికొందరు పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. అందం, అభినయం ఉన్నా సినిమాలకు దూరమైన వారున్నారు. పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్‌కు ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే, అవకాశాలు కూడా ఎక్కువగానే వచ్చాయి ఈ చిన్నదానికి. కానీ, ఊహించని విధంగా సినిమాలకు దూరమైంది. దాంతో ఆమె అభిమానులు తెగ ఫీల్ అయ్యారు. అసలు ఎందుకు హీరోయిన్‌గా చేయడం లేదు అని తెగ ఆలోచిస్తున్నారు. పెళ్లి కూడా చేసుకోలేదు, వేరే వ్యాపారాల్లో కూడా అడుగుపెట్టలేదు. అయినా హీరోయిన్‌గా చేయడం లేదు. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా?
ఎవరా భామ?
పైన ఫొటోలో కనిపిస్తున్న భామ ఛార్మీ కౌర్ (Charmy Kaur). ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘మాస్’, ‘లక్ష్మి’, ‘స్టైల్’, ‘మంత్ర’, ‘జ్యోతి లక్ష్మి’ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. తన నటనతో పాటు గ్లామర్ పరంగానూ మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. హీరోయిన్‌గా పీక్స్ లో ఉండగానే ఛార్మి నటనకు గుడ్‌బై చెప్పేసింది. ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలు చేస్తుంది ఈ పంజాబీ భామ.
పూరీ జగన్నాథ్‌తో భాగస్వామ్యం
డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)తో ప్రొడ్యూసర్‌గా ఛార్మి భాగస్వామ్యం మొదలుపెట్టింది. పూరీ జగన్నాథ్‌తో కలిసి ఛార్మి 8 చిత్రాలు నిర్మించింది. వాటిలో ‘జ్యోతి లక్ష్మి’, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలు మాత్రమే హిట్టయ్యాయి.
ఛార్మీపై కృష్ణవంశీ వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే, ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కృష్ణవంశీ ఛార్మీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ఛార్మి చాలా డెడికేషన్‌తో వర్క్ చేస్తుంది. ఛార్మి అద్భుతమైన నటి. అందులో తిరుగులేదు. కానీ ఆమె ఎందుకు అంతగా సక్సెస్ కాలేదు అనేది అర్థం కావడం లేదు. అది పూర్తిగా బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఆమె డెడికేషన్ లెవల్స్ సూపర్ గా ఉంటాయి. సినిమా కోసం ఎంత కష్టమైనా చేస్తుంది. దెబ్బలు తగిలి రక్తం వస్తున్నప్పటికీ పట్టించుకోకుండా నటిస్తూనే ఉంటుంది. ‘శ్రీ ఆంజనేయం’, ‘చక్రం’ లాంటి చిత్రాల్లో కొన్నిసార్లు అలా జరిగింది” అని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.