పహల్గామ్‌లో ఉగ్రదాడికి పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) పేరుతో పాక్‌పై మంగళవారం అర్ధరాత్రి మిస్సైళ్లతో (Missiles) మెరుపుదాడి చేపట్టిన భారత్ (India).. తాజాగా డ్రోన్ల దాడితో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌పై విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. పాక్ లోని కీలక నగరాలపై భారత్ దాడులు చేపట్టింది. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిలోని పాక్ సైనిక స్థావరాలే లక్ష్యంగా తాజాగా భారత్ దాడులు జరిపింది. పాక్ ఆర్మీ (Pak Army) హెడ్ క్వార్టర్ (Headquarters)పై డ్రోన్ దాడి (Drone Attack) చేసిన భారత్.. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (Air Defense System) ను ధ్వంసం (Destroyed) చేసింది. ఈ దాడిలో పాక్ సైనికులు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది.
ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాక్ మిస్సెల్స్‌ను నిర్వీర్యం చేసింది. చైనా నుంచి పాక్ తెచ్చుకున్న హెచ్ క్యూ9 (HQ-9) క్షిపణి రక్షణ వ్యవస్థను భారత ఆర్మీ చేపట్టిన దాడిలో నిర్వీర్యం అయిపోయాయి. రావల్పిండి ఆర్మీ హెడ్ క్వార్టర్, రావల్పిండి క్రికెట్ స్టేడియం (Rawalpindi Cricket Stadium)పై భారత్ డ్రోన్ దాడి చేపట్టింది. డ్రోన్ దాడితో రూ.1600 కోట్ల పాక్ ఆస్తులను భారత్ ధ్వంసం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (ఎల్ఓసీ) వద్ద కూడా భారత ఆర్మీ జోరు కొనసాగుతోంది. మోర్టార్టు, శతఘ్నులతో పాకిస్తాన్‌పై భారత సైన్యం విరుచుకుపడుతోంది.
పాకిస్తాన్‌పై ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుండడంతో లాహోర్‌లోని తన ఎంబసీ సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అమెరికా సూచించింది. ఆపరేషన్ సింధూర్ మొదటి రోజు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ఏకంగా 100 మంది ఉగ్రమూకలను మట్టుబెట్టిన భారత త్రివిధ దళాలు.. తాజాగా చేపట్టిన డ్రోన్ దాడిలో పాక్ ఆర్థిక మూలాలను లక్ష్యంగా చేసుకొని దాడి జరిపినట్లుగా తెలుస్తోంది. డ్రోన్ల దాడిలో పాక్‌కు రూ.1600 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా స్పష్టం అవుతోంది.