భారత ఆర్మీ (India Army) ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) లో పాకిస్తాన్ బహావల్పూర్ (Bahawalpur) లోని జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) చీఫ్ మౌలానా మసూద్ అజార్ (Maulana Masood Azhar) ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. మిస్సైళ్ల ధాటికి మసూద్ కుటుంబం (Masood Family) మటాష్ అయిపోయింది. టార్గెట్ చేసిన దాడి చేసిన ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులను తయారుచేస్తున్న పాకిస్తానీ కార్యకలాపాల స్థావరాలను నేలమట్టం చేసింది.
ఈ దాడిలో, మసూద్ అజార్ ఇంటితో పాటు అతడి ట్రైనింగ్ క్యాంప్‌పై కూడా మిస్సైల్ దాడి జరగడంతో మసూద్ కుటుంబసభ్యులు 10 మంది మరణించారు. పాకిస్తాన్ మాధ్యమాల ప్రకారం, ఈ ఘటనలో మసూద్ తన కుటుంబంతోపాటు మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ అవి వాస్తవం కాదని, దాని వెనుక కూడా కుట్ర ఉందని తేలిపోయింది.








