మ‌ద్యం వ‌ద్దంటే కేసు.. ఏంటో ఈ వింత‌

మ‌ద్యం వ‌ద్దంటే కేసు.. పాత గుంటూరులో విచిత్ర ఘ‌ట‌న‌

Summarize with AI

గుంటూరు (Guntur) లో విచిత్ర‌మైన‌ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంది. బాధితుల‌పైనే కేసు (Case) న‌మోదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. కూట‌మి ప్ర‌భుత్వం (Coalition Government) ఏర్ప‌డిన త‌రువాత మ‌ద్యం షాపులు (Liquor Shops) ప్రైవేట్ వ్య‌క్తుల (Private Individuals) చేతుల్లోకి వెళ్లిపోయాయి. టండ‌ర్లు షాపులు ద‌క్కించుకున్న‌వారు షాపుల‌ను వారి వ్యాపారానికి అనువైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోగా స్థానికుల నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్త‌మవుతున్న‌ విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో గుంటూరులోని మ‌ణి హోట‌ల్ సెంట‌ర్‌ (Mani Hotel Center)లో ఏర్పాటు చేసిన మద్యం షాపును వేరే చోటుకు మార్చాల‌ని డిమాండ్ (Demand) చేస్తూ స్థానికంగా ఉన్న మ‌హిళ‌లు ధర్నా (Protest) చేప‌ట్టారు. పిల్ల‌లు, మ‌హిళ‌లు ఉండే చోట మ‌ద్యం షాపు ఎత్తివేయాల‌ని కోరుతూ ఆందోళ‌న చేశారు. మ‌ద్యం వ‌ద్దు అని నిన‌దించిన మ‌హిళ‌ల‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. ధర్నా చేసిన మహిళలపై పాత గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. లక్కీ వైన్స్ (Lucky Wines) పై దౌర్జన్యం (Violence) చేశారంటూ మహిళలు స్థానికులపై కేసు నమోదు చేశారు.

మ‌ణి హోట‌ల్ సెంట‌ర్‌లో మ‌ద్యం షాపు వ‌ద్దు అని ఆందోళ‌న చేప‌ట్టిన 20 మందిపై కేసు (Case) నమోదు అయ్యింది. మహిళలతో పాటు స్థానికులను పోలీసులు పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కు పిలిపించిన‌ట్లుగా స‌మాచారం. మద్యం షాపు తొలగించమని నిరసన తెలిపితే మహిళలు, స్థానికుల‌పై కేసులు పెట్టడం ఏంటని మ‌హిళ‌లు ఆగ్ర‌హిస్తున్నారు. మ‌ద్యం వ‌ద్దు అంటే కేసులు పెడ‌తారా అని ప్ర‌శ్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment