ఆంధ్రజ్యోతి (Andhra Jyothi) ఏబీఎన్ (ABN), ఈటీవీ (ETV) ఛానళ్లు (Channels) ఫేక్ ప్రచారం (Fake Propaganda) చేస్తున్న ఫేక్ ఛానెళ్లు అంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రధానమంత్రి మోడీ(Modi)ని కలిసి వివిధ అంశాలపై వినతిపత్రం అందజేసినా, తాము పీఎంను కలవలేదంటూ తప్పుడు ప్రచారాలు చేశాయని ఆ ఛానెళ్లపై మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన ఫొటోలు, సాక్ష్యాలు కూడా తమ వద్ద ఉన్నాయన్నారు. “మేము మోడీని కలవలేదని మీరు ప్రచారం చేస్తున్నారు. ఇవిగో సాక్ష్యాలు, ఫొటోలు పంపించమంటారా?” అంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ నేతలు మోడీని కలవలేదని అసత్య ప్రచారం చేసిన ఏబీఎన్, ఈటీవీ ఛానెళ్లపై ఎమ్మెల్యే విరుపాక్షి మండిపడ్డారు. “మీ ఛానెల్ ఫేక్, మీ కూటమి ప్రభుత్వం ఫేక్” అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. “మేము వినతిపత్రం ఇవ్వలేదని మీరు నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, లేకపోతే మీ ఛానెల్ మూత వేసుకుంటారా?” అంటూ ఆయన ఛాలెంజ్ విసిరారు.
వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, ప్రజల సమస్యలపై ప్రధాని మోడీకి వినతిపత్రం ఇచ్చామని విరుపాక్షి తెలిపారు. “ప్రజల కోసం పోరాటం చేస్తుంటే, పచ్చ మీడియా తప్పుదోవ పట్టిస్తోంది” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మోడీకి విన్నపం ఇవ్వడం మీకు జీర్ణం కాలేదా? ఈనాడు, ఏబీఎన్ ఛానళ్లకు సిగ్గూ లేదా?” అంటూ ఆయన ప్రశ్నించారు.









ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు