68 రోజుల తరువాత వైసీపీ ఎమ్మెల్యే విడుదల

68 రోజుల తరువాత వైసీపీ ఎమ్మెల్యే విడుదల

Summarize with AI

ఎట్ట‌కేల‌కు ఆలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే(YSRCP MLA) విరూపాక్షికి (Virupakshi) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో(Andhra Pradesh High Court) భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ధర్మాసనం బెయిల్ (Bail)మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత 68 రోజులుగా జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షి త్వరలోనే విడుదల కానున్నారు.

ఆదోనిలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకు (SC, ST Atrocities) సంబంధించి ఎమ్మెల్యే విరూపాక్షి విడుదల కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం వాదోపవాదాలు ముగిశాయి. ఎమ్మెల్యే తరఫున ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డితో(Ponnavolu Sudhakar Reddy) పాటు వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జీవన్‌సింగ్(Jeevan Singh), లక్ష్మీకాంత్‌లు(Lakshmikanth) బలమైన వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు నిశితంగా పరిశీలించిన న్యాయస్థానం తీర్పును గురువారానికి రిజర్వ్‌ చేసింది.

కేసుకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంత‌రం హైకోర్టు ఎట్టకేలకు ఎమ్మెల్యే విరూపాక్షికి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే కొన్ని కేసుల్లో ఊరట లభించిన నేపథ్యంలో, తాజాగా తీవ్రమైన అట్రాసిటీ కేసులోనూ బెయిల్ రావడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 68 రోజుల సుదీర్ఘ రిమాండ్ అనంతరం ఆయన జైలు నుంచి బయటకు రానుండటంతో ఆలూరు నియోజకవర్గంలో(Alur Constituency) పండుగ వాతావరణం నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment