పశ్చిమబెంగాల్ రాష్ట్రం పేరును ‘పశ్చిమ బంగా’ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి అధ్యక్షతన సోమవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ప్రస్తుతం బెంగాలీ భాషలో రాష్ట్రాన్ని పశ్చిమ బంగా అని పిలుస్తున్నప్పటికీ, ఇంగ్లీష్ సహా అన్ని భాషల్లోనూ అధికారికంగా అదే పేరును అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు డిసెంబర్ 9న రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు సీఎం ప్రకటించారు.
డిసెంబర్ 4 నుంచి 14 వరకు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా డిసెంబర్ 9న పేరు మార్పు ప్రతిపాదనపై చర్చించి తీర్మానం ఆమోదించనున్నారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన అనంతరం తదుపరి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ‘బంగ్లా’గా పేరు మార్చాలని ప్రతిపాదించినప్పటికీ కేంద్రం నుంచి ఆమోదం లభించలేదు.








