‘ముందు నీ కుటుంబ చరిత్ర చూసుకో’.. – లోకేష్ ట్వీట్‌కు వైసీపీ కౌంటర్

‘ముందు నీ కుటుంబ చరిత్ర చూసుకో’.. - లోకేష్ ట్వీట్‌కు వైసీపీ కౌంటర్

మత్స్యకారుల భూముల అంశం మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) చేసిన విమర్శలకు వైసీపీ(YSRCP) ఘాటుగా బదులిచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నెల్లూరు పర్యటనలో జాలర్లకు (Fisherfolk) ఇచ్చిన భరోసా వీడియోను లోకేష్ తప్పుబడుతూ చేసిన ట్వీట్‌పై వైసీపీ కౌంట‌ర్ ఇచ్చింది. త‌ల్లి, చెల్లి అంటూ లోకేష్ ట్వీట్‌కు.. ముందు నీ కుటుంబ చ‌రిత్ర తెలుసుకో అంటూ ప‌లు సంఘ‌ట‌న‌లు గుర్తుచేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది.

వైసీపీ ట్వీట్‌..
నారా లోకేష్ కుటుంబ సభ్యుల ప్రస్తావన తేవడంపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. “లోకేష్.. నీ మేనత్తలు (Aunts) ఎవరో నీకు తెలుసా? ఏ రోజైనా వారిని ఇంటికి పిలిచి పట్టుబట్టలు పెట్టావా? వారి యోగక్షేమాలు అడిగావా?” అని ప్రశ్నించింది. సొంత బాబాయ్ (Own Uncle) రామ్మూర్తి నాయుడిని (Rammurthy Naidu) ఎందుకు గొలుసులతో కట్టేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. చివరకు నానమ్మ చనిపోతే చంద్రబాబు తలకొరివి కూడా పెట్టలేదని విమర్శించారు.

వెన్నుపోటు రాజకీయాలపై విమర్శలు
చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి సాగించిన ‘వెన్నుపోటు’ పర్వాలను వైసీపీ ఎండగట్టింది. ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్టీఆర్‌ను (NTR) మోసం చేసి పార్టీని లాక్కున్నారని, ఆ తర్వాత హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లను తమ అవసరాల కోసం వాడుకుని వదిలేశారని ఆరోపించారు. గతంలో ప్రధాని మోడీని తీవ్ర పదజాలంతో విమర్శించి, ఇప్పుడు అధికారమే పరమావధిగా ఆయనతో జతకట్టారని ఎద్దేవా చేశారు. ఏ ఒక్క ఎన్నికల్లోనూ ఒంటరిగా గెలవలేని స్థితి చంద్రబాబుదని విమర్శించారు.

ఆస్తులపై ప్రశ్నలు
రెండెకరాల నుంచి లక్షల కోట్లకు చంద్రబాబు ఎలా ఎదిగారని వైసీపీ ప్రశ్నించింది. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, ప్రజల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొంది. జువ్వలదిన్నె విషయంలో జాలర్ల పక్షాన నిలిచిన జగన్‌ను విమర్శించే ముందు, జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీని తరిమేసిన చరిత్రను గుర్తు చేసుకోవాలని హితవు పలికింది వైసీపీ.

“నువ్వు ఒకటి అంటే మేము పది అనగలం.. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు” అంటూ లోకేష్‌కు వైసీపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. అధికార దాహం కోసం ఎవరినైనా మోసం చేసే నైజం చంద్రబాబుదేనని ఈ సందర్భంగా విమర్శించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment