స్థానిక నామినేషన్ల వేళ ఏపీలో దౌర్జన్యకాండ

స్థానిక నామినేషన్ల వేళ ఏపీలో దౌర్జన్యకాండ

Summarize with AI

ఏపీలో(Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నామినేషన్ల పర్వం (Nomination Process) తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. ఎన్నికల‌కు భయపడి ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను (YSRCP Candidates) భౌతికంగా అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ (TDP) శ్రేణులు దాడులు(Attacks), దౌర్జన్యాలకు (Harassment) తెగబడుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. మంత్రాలయం, పీసీ పల్లి, తుని, పుంగనూరు, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, పత్రాలు చించివేయడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి ఘ‌ట‌న‌లు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నాయి.

మంత్రాలయంలో దాడి
మంత్రాలయం (Mantralayam) ఎంపీడీవో కార్యాలయం (MPDO Office) వద్ద వైసీపీ మండల అధ్యక్షుడు విశ్వనాథ రెడ్డిపై (Viswanath Reddy) టీడీపీ కార్యకర్తలు భౌతిక దాడికి దిగారు. రాజకీయం కోసం ప్రత్యర్థులపై భౌతిక దాడులకు పాల్పడటంపై స్థానిక ప్రజలు, నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

నామినేషన్ పత్రాల చించివేత
కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పీసీ పల్లి మండలంలో పెద్ద ఇర్లపాడు ఎంపీటీసీ అభ్యర్థి పోలు వరలక్ష్మి(Polu Varalakshmi), చింతగుంపల్లి ఎంపీటీసీ అభ్యర్థి మడతల సాయికుమార్ (Madathala Sai Kumar) నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లగా కూటమి నాయకులు, కార్యకర్తలు వారిని చుట్టుముట్టారు. దౌర్జన్యంగా వారి చేతుల్లోని నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేశారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనను కనిగిరి వైసీపీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ (Dr. Daddala Narayana Yadav) తీవ్రంగా ఖండించారు.

తుని, పుంగనూరుల్లో మహిళా అభ్యర్థులపై అరాచకం
తునిలో వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకునేందుకు టీడీపీ యత్నించగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా(Dadisetty Raja) ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రతిఘటించాయి. ఇక పుంగనూరులో నామినేషన్లు వేయడానికి వచ్చిన మహిళా అభ్యర్థుల చేతుల్లోని పత్రాలను గుంజుకుని నడిరోడ్డుపై చించివేస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారు.

శ్రీకాళహస్తిలో వాహనాలకు నిప్పు
శ్రీకాళహస్తి (Srikalahasti) ఎంపీడీవో కార్యాలయం వద్ద వైసీపీ అభ్యర్థుల వాహనాలను ధ్వంసం చేయడమే కాకుండా ఓ ద్విచక్ర వాహనానికి నిప్పంటించారు. నామినేషన్లు వేసేందుకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బహిరంగంగానే హెచ్చరిస్తుంటే పోలీసులు (Police) ప్రేక్షకపాత్ర వహించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి
ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించాల్సింది ప్రజలు వేసే ఓటు (People’s Vote) మాత్రమే. ప్రత్యర్థులను బరిలో నిలవకుండా బెదిరింపులు, భౌతిక దాడులు, నామినేషన్ పత్రాల ధ్వంసంతో అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకే విఘాతం. ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకుని నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత కల్పించి, దాడులకు పాల్పడిన నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment