సూడాన్‌లో(Sudan) అంతర్యుద్ధం మరింత భయానకంగా మారుతోంది. సూడాన్–దక్షిణ సూడాన్ (Sudan-South Sudan) మధ్య వివాదాస్పద ప్రాంతమైన అబేయ్‌లోని(Abyei) అమియెట్ మార్కెట్‌పై (Amiet Market) జరిగిన డ్రోన్ దాడిలో(Drone Attack) కనీసం 153 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల్లో చిన్నారులు (Children) కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పెట్రోల్ బంక్ (Petrol Station) సమీపంలో పేలుడు సంభవించి మంటలు వ్యాపించడంతో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ఈ దాడికి సూడాన్ సైన్యమే కారణమని అబేయ్ ప్రాంత అధికారులు ఆరోపించినట్లు వార్తలు వెల్లడించాయి. దక్షిణ సూడాన్ విదేశాంగ శాఖ కూడా ఘటనను ఖండించినట్లు సమాచారం. 2023 ఏప్రిల్ నుంచి సూడాన్ సైన్యం(Sudanese Army), పారామిలిటరీ దళమైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య పోరు కొనసాగుతుండగా, డ్రోన్ దాడులతో సాధారణ పౌరుల ప్రాణాలకు ముప్పు పెరుగుతోంది.
మరోవైపు, పశ్చిమ ఆఫ్రికా (West Africa) దేశమైన మాలిలోనూ ఉగ్రదాడి చోటుచేసుకుంది. తూర్పు మాలిలోని(Mali) మెనాకా ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 48 మంది మరణించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ (Associated Press – AP) కథనాన్ని ఉటంకిస్తూ వార్తలు పేర్కొన్నాయి. సూడాన్‌లో అంతర్యుద్ధం, మాలిలో ఉగ్రదాడులతో ఆఫ్రికాలో పౌరుల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.








