పూడి శ్రీహరి అరెస్ట్ అమానుషం.. – డీజీపీకి వైసీపీ ఫిర్యాదు

పూడి శ్రీహరి అరెస్ట్ అమానుషం.. - డీజీపీకి వైసీపీ ఫిర్యాదు

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (YSRCP State General Secretary) (మీడియా విభాగం), మాజీ సీఎం వైఎస్ జగన్ (Y. S. Jagan Mohan Reddy) సీపీఆర్వో (CPRO) పూడి శ్రీహరిని (Poodi Srihari) పోలీసులు నిర్బంధించిన తీరుపై వైసీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి (Lella Appi Reddy) రాష్ట్ర డీజీపీకి (State DGP) లేఖ రాశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిని ఉగ్రవాది తరహాలో నడిరోడ్డుపై అడ్డుకుని తీసుకువెళ్లడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు.

తాడేపల్లిలోని (Tadepalli) రెయిన్‌బో విల్లాస్ (Rainbow Villas) సమీపంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు శ్రీహరిని అడ్డుకున్నారని, కనీసం నోటీసు ఇవ్వకుండా ఒక ఉగ్రవాదిని బంధించినట్లు బలవంతంగా తీసుకెళ్లారని అప్పిరెడ్డి పేర్కొన్నారు. అరెస్ట్ చేసే సమయంలో తాము ఏ స్టేషన్‌కు చెందిన వారో, ఏ నేరం మీద తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదని.. ఇది సుప్రీంకోర్టు (Supreme Court) మార్గదర్శకాలను యథేచ్ఛగా ఉల్లంఘించడమేనని ధ్వజమెత్తారు.

నిన్న రాత్రి 10 గంటల నుంచే పోలీసులు శ్రీహరి నివాసం వద్ద రెక్కీ నిర్వహించారని, తెల్లవారుజామున 3 గంటల నుంచే కాపు కాసి ఉదయం 8 గంటలకు అదుపులోకి తీసుకున్నారని సీసీ ఫుటేజ్ సాక్ష్యాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగానికి బదులు ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ (“Red Book Constitution”) నడుస్తోందని, ప్రభుత్వాధినేత కక్ష సాధింపు చర్యలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని అప్పిరెడ్డి ఆరోపించారు.

శ్రీహరిని అక్రమంగా నిర్బంధించి, చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎటువంటి ఆధారాలు లేకుండా అదుపులోకి తీసుకున్న పూడి శ్రీహరిని వెంటనే విడుదల చేయాలి. ఒక ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ముఖ్య నేతపై పోలీసులు ఈ రకంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment