వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కర్నూలు పర్యటనకు పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. నన్నూరు టోల్‌ప్లాజా వద్ద వైయస్ జగన్‌కు ఘన స్వాగతం లభించింది. రోడ్డుకు ఇరువైపులా భారీగా చేరుకున్న ప్రజలు ఆయనకు అభివాదం చేయగా, వైయస్ జగన్ కూడా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
పోటెత్తిన కర్నూలు
వైయస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల వాహనాలను తనిఖీ చేశారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, నంద్యాల టోల్‌గేట్ వద్ద ఎమ్మెల్సీ రమేష్, ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ ఆంక్షలను దాటుకుని పలువురు నాయకులు, కార్యకర్తలు కర్నూలుకు చేరుకున్నారు.
బాధితుల సమస్యలు విన్న జగన్
కర్నూలు పర్యటనలో పలువురు బాధితులు, అభ్యర్థులు వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. సుగాలి ప్రీతి తల్లి కూటమి ప్రభుత్వంలోనూ తమకు న్యాయం జరగలేదని, పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం వీల్‌చైర్ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు.
డీఎస్సీ అభ్యర్థుల ఆవేదన
వెంకన్నబావి ప్రాంతంలో డీఎస్సీ అభ్యర్థులు వైయస్ జగన్‌ను కలిసి నియామకాల్లో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమకు అండగా నిలిచి న్యాయం జరిగేలా పోరాడాలని కోరుతూ “మీరే దిక్కు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వైయస్ జగన్ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా జైలుకు వెళ్లారు.








కేసీఆర్, రేవంత్‌పై పోచారం కీలక వ్యాఖ్యలు.. మళ్లీ క్లారిటీ