సూర్య సెన్సేషనల్ రికార్డ్.. విజయ్ ‘జననాయగన్’ రికార్డ్ బద్దలు!

సూర్య సెన్సేషనల్ రికార్డ్.. విజయ్ ‘జననాయగన్’ రికార్డ్ బద్దలు!

Summarize with AI

కోలీవుడ్ వర్సటైల్ స్టార్ సూర్యకు (Suriya) తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ప్రేక్షకులను తన నటనతో అలరిస్తూ, ఆంధ్రా(Andhra Pradesh), తెలంగాణలను (Telangana) తన రెండో సొంత ఇల్లుగా మార్చుకున్న సూర్య, తాజాగా మరో సంచలన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన కథానాయకుడిగా వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’(Viswanath & Sons). సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ (Naga Vamsi) నిర్మించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతుంది.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్‌(Advance Bookings) ఓపెన్ చేసారు మేకర్స్. అయితే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సరికొత్త రికార్డు సృష్టించి ఇటీవల వచ్చిన విజయ్ (Vijay) జననాయగన్ (Jana Nayagan) రికార్డ్ బద్దలు కొట్టింది. ‘జననాయగన్’ ₹1.72 కోట్లు ఓపెనింగ్ డే ప్రీ-సేల్స్ రికార్డును ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అధిగమించింది. దీనితో ఈ ఏడాది అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన నంబర్ 1 డబ్బింగ్ చిత్రంగా నిలిచింది. తెలుగు వెర్షన్ డ్వాన్స్‌లు రూ. 1.82 కోట్ల మార్కును అధిగమించాయి. తెలుగు ప్రేక్షకులు మొదటి నుంచీ వైవిధ్యమైన సినిమాలను, నటనను ఆదరించడంలో ముందుంటారు. సూర్య మార్కెట్ మరియు క్రేజ్ పరంగా తెలుగు రాష్ట్రాలు నిజంగానే ఆయనకు రెండో సొంత గడ్డలా మారిపోయాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా నమోదైన అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 7 కోట్ల మార్కును అందుకుంది. వరుస రికార్డులతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాపై టాలీవుడ్ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment