దుల్కర్ సల్మాన్ సినిమాలకు మాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాది ప్రేక్షకుల్లోనూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’పై కూడా మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తొలుత ఆగస్టు 20న ఓనం కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కొత్త రిలీజ్ డేట్‌గా 2026 సెప్టెంబర్ 3ను ఖరారు చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొంత జాప్యంతో పాటు సినిమాను మరింత విస్తృతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
‘ఐ యామ్ గేమ్’ను పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దుల్కర్ సల్మాన్‌కు దక్షిణాదితో పాటు నార్త్ ఇండియాలోనూ మంచి గుర్తింపు ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో దుల్కర్‌కు జోడీగా కయాదు లోహర్ నటిస్తుండగా, ఆంటోని వర్గీస్, మిస్కిన్, కతిర్, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు కథకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచిన చిత్ర బృందం.. సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.








కేసీఆర్, రేవంత్‌పై పోచారం కీలక వ్యాఖ్యలు.. మళ్లీ క్లారిటీ