పవన్ కళ్యాణ్‌కు బిగ్ థ్యాంక్స్ చెప్పిన‌ వైసీపీ

పవన్ కళ్యాణ్‌కు బిగ్ థ్యాంక్స్ చెప్పిన‌ వైసీపీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్ర‌తిప‌క్ష వైసీపీ బిగ్ థ్యాంక్స్ చెప్పింది. త‌మ పార్టీ సోష‌ల్ మీడియా చేప‌ట్టిన ఫ‌స్ట్ క్యాంపెయిన్‌కు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ స్టార్ క్యాంపెయిన‌ర్‌గా నిలిచార‌ని వైసీపీ ప్ర‌శంసించింది. సంక్రాంతి సంద‌ర్భంగా వైసీపీ ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. పండ‌గ‌కు సొంతూర్ల‌కు వ‌చ్చేవారు గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో వైఎస్ జ‌గ‌న్ తీసుకొచ్చిన మార్పుల‌ను గ‌మ‌నిస్తే ఓ సెల్ఫీ దిగి పోస్టు చేయండి అంటూ ఎక్స్ వేదిక‌గా కోరింది.

కాగా, ఇటీవ‌ల కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక ప‌వ‌న్ క‌ళ్యాణ్ తమ అధినేత జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి విప‌రీత‌మైన ప్ర‌చారం చేస్తున్నందుకు ఆయనకు థాంక్స్ చెప్పింది. ప్ర‌భుత్వ స్కూళ్ల‌కు వెళ్లి కార్పొరేట్ స్కూల్ కంటే బాగుంద‌ని ప్ర‌శంసించి ఆ చిన్నారుల‌తో సెల్ఫీ దిగ‌డం, కర్నూలుకు జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన గ్రీన్‌కో సోలార్ ప్రాజెక్ట్‌ను సంద‌ర్శించి ఆ ప్రాజెక్టు గొప్ప‌త‌నాన్ని వివ‌రించ‌డం, విశాఖలో రుషికొండ‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్మించిన భ‌వ‌నాల వ‌ద్ద ప‌వ‌న్ దిగిన‌ ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసి, త‌మ స్టార్ట్ క్యాంపెయిన‌ర్ అంటూ థ్యాంక్స్ చెప్పింది.

Join WhatsApp

Join Now

Leave a Comment