మత్స్యకారులు గ‌ల్లంతు.. కొనసాగుతున్న గాలింపు

మత్స్యకారులు గ‌ల్లంతు.. కొనసాగుతున్న గాలింపు

విశాఖపట్నం (Visakhapatnam) తీరంలో సముద్రంలోకి చేపల వేటకు (Fishing) వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు (Fishermen) గల్లంత‌య్యారు(Missing). ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తిరిగి వస్తున్నామని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన కొద్ది గంటలకే వారితో సంబంధాలు తెగిపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర‌ ఆందోళనలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక మత్స్యకారుడిని కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) సురక్షితంగా రక్షించగా, మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

వివరాల ప్రకారం, ఈ నెల 1వ తేదీన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ (Visakhapatnam Fishing Harbour) నుంచి ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. నిన్న మధ్యాహ్నం సముద్రంలో వాతావరణం ప్రతికూలంగా మారడంతో తీరానికి తిరిగి వస్తున్నామని కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. అయితే ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

గల్లంతైన మత్స్యకారుల్లో సీతారాం (Sitaram), గంగయ్య(Gangayya), బండయ్య(Bandayya), అప్పలరాజు(Appalaraju), మేడ చిన్న అప్పయ్య( (Meda Chinna Appayya, కారి చిన్న(Kari Chinna), కే. చిన్నయ్య(K. Chinnayya) ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఆరుగురు విజయనగరం జిల్లా భోగాపురం మండలానికి చెందినవారు కాగా, మరో మత్స్యకారుడు భీమిలి (Bhimili) ప్రాంతానికి చెందిన వ్యక్తి. వారిలో కారి చిన్న అనే మత్స్యకారుడిని భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు. మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

అయితే, తమ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ఎదురుచూస్తున్న బాధితులు ప్రభుత్వ యంత్రాంగం స్పందనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు ఫిషరీస్ శాఖ కార్యాలయం వద్ద నిరీక్షిస్తున్నప్పటికీ, తమకు సరైన సమాచారం అందించడం లేదని, బాధను వినేందుకు కూడా అధికారులు ముందుకు రావడం లేదని వాపోతున్నారు.

మత్స్యకారుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా, స్థానిక మత్స్యకారులు కూడా ప్రభుత్వ స్పందనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. విపత్తు సమయంలో బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడం, ఎప్పటికప్పుడు సమాచారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని వారు పేర్కొంటున్నారు. మరోవైపు, గల్లంతైన మిగిలిన ఆరుగురు మత్స్యకారులను సురక్షితంగా రక్షించాలని కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు.

ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతుండగా, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సహాయక బృందాలు సముద్రంలో విస్తృతంగా శోధిస్తున్నాయి. మిగిలిన మత్స్యకారుల ఆచూకీపై అధికారిక సమాచారం కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment