విజయవాడలోని(Vijayawada) న్యూ రాజరాజేశ్వరి పేటలో(New Rajarajeshwari Peta) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న యువతిపై ఓ యువకుడు కొడవలితో(Sickle) దాడి చేసిన ఘటన కలకలం రేపింది. అనుమానంతో ప్రియురాలు మహాలక్ష్మి గొంతు కోసి (Slit Her Throat) హత్య చేసినట్లు సమాచారం.
మహాలక్ష్మి(Mahalakshmi), చిన్నారావు (Chinnarao) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే మహాలక్ష్మిపై అనుమానం పెంచుకున్న చిన్నారావు ఆమెపై దాడికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ దాడిలో మహాలక్ష్మి మెడకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం చిన్నారావు భవనం డాబాపైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకి మృతిచెందాడు.
ఇక చిన్నారావు దాడిలో తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మృత్యువుతో పోరాడుతూ ఆమె మృతి చెందింది. ఒకే ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో న్యూ రాజరాజేశ్వరి పేటలో విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం
— Telugu Feed (@Telugufeedsite) October 3, 2026
న్యూ రాజరాజేశ్వరిపేటలో ప్రియురాలి మెడను కొడవలితో కోసిన ప్రేమోన్మాది
గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న మహాలక్ష్మి, చిన్నారావు
మహాలక్ష్మిపై అనుమానంతో పీక కోసి హత్యాయత్నానికి ఒడిగట్టిన చిన్నారావు
తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహాలక్ష్మి… pic.twitter.com/OVlNNtEVUe








