క్షమాపణలు చెప్పిన వేణుస్వామి

క్షమాపణలు చెప్పిన వేణుస్వామిక్షమాపణలు చెప్పిన వేణుస్వామి

ఫేమ‌స్ సెల‌బ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి తాజాగా తెలంగాణ మ‌హిళా కమిషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. ముఖ్యంగా హీరో నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ జంటపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

వివాదానికి కారణమైన వ్యాఖ్యలు
వేణు స్వామి గతంలో, నాగచైతన్య మరియు శోభితల మధ్య సంబంధం ఎక్కువ కాలం నిలవదని, వారు మళ్లీ విడిపోతారని జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించి ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. మ‌హిళా కమిషన్ నోటీసులు జారీ చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ వేణు స్వామి హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేన‌ని హైకోర్టు తేల్చిచెప్పేసింది.

కమిషన్ ముందు క్షమాపణ
ఈ నేపథ్యంలో మంగళవారం ఉమెన్ కమిషన్ కార్యాలయంలో వేణు స్వామి వ్యక్తిగతంగా హాజరై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కాబోదని హామీ ఇచ్చారు. మ‌హిళా కమిషన్ కూడా ఆయనను గట్టిగా హెచ్చరించి, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి బాధ్యతారహితంగా మాట్లాడరాదని సూచించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment