అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీ యువకుడు దుర్మరణం

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీ యువకుడు దుర్మరణం

Summarize with AI

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ఐదు నెలల క్రితమే అమెరికా వెళ్లిన దిలీప్ కుమార్ (30) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటనతో స్వగ్రామమైన తిరుపతి జిల్లా చిట్వేలి మండలం జెట్టివారిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. జెట్టివారిపల్లికి చెందిన దిలీప్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ఐదు నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడ ఉద్యోగంలో చేరి విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం స్నేహితులతో కలిసి కారులో కెన్నెట్ నగరంలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో దిలీప్ కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అదే కారులో ప్రయాణిస్తున్న ఓ యువతి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. చిట్వేలికి చెందిన మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

అమెరికాలో ఉద్యోగంలో చేరి భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న దిలీప్ కుమార్ అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment