సంస్కృత వ‌ర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్

సంస్కృత వ‌ర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్

Summarize with AI

తిరుపతి (Tirupati) జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (National Sanskrit University)లో చోటుచేసుకున్న లైంగిక వేధింపుల (Sexual Harassment) ఘటన దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఒడిశా (Odisha)కు చెందిన విద్యార్థిని (Student) ప‌ట్ల అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు (Assistant Professors) దారుణంగా ప్ర‌వ‌ర్తించిన కేసు విచార‌ణ‌పై పోలీసులు వేగం పెంచారు. ఒడిశా జార్హ్‌పూర్ (Jharpura, Odisha) ప్రాంతానికి చెందిన బాధిత విద్యార్థిని ఇచ్చిన సమాచారం ఆధారంగా తిరుపతి వెస్ట్ పోలీసులు కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు బాధితురాలి వద్ద వీడియో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.

విచారణలో బాధితురాలు కీలక అంశాలను వెల్లడించిన‌ట్లుగా స‌మాచారం. ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ (Professor Laxman Kumar) అనేకసార్లు తనపై లైంగిక దాడులు, వేధింపులు జరిపాడని స్పష్టంగా పేర్కొన్న‌ట్లుగా తెలుస్తోంది. వేధింపులు రోజురోజుకూ పెరుగుతుండటంతో పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని లక్ష్మణ్‌కు చెప్పినట్టు తెలిపింది. అయితే ఫిర్యాదు చేయకుండా అడ్డుకునేందుకు ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి (Professor Shekhar Reddy) వద్ద మన ఇద్దరి వీడియో ఉందని బెదిరించి, అదేవిధంగా లక్ష్మణ్ మరికొన్ని సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోప‌ణ‌.

ఈ మొత్తం స్టేట్‌మెంట్‌ను పోలీసులు చాలా ముఖ్యమైన ఆధారంగా పరిగణిస్తున్నారు. ఇటువంటి ఘోర చర్యలకు పాల్పడిన వ్యక్తులు కఠినమైన శిక్షకు గురికావాలని బాధితురాలు పోలీసులను వేడుకున్న‌ట్లుగా స‌మాచారం. కేసు తీవ్రత దృష్ట్యా, తిరుపతి పోలీసులు ప్రధాన నిందితులు లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిలను అరెస్ట్ చేశారు.

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో జరిగిన ఈ లైంగిక వేధింపుల సంఘటన అకాడమిక్ వర్గాల్లో కలకలం రేపింది. విద్యార్థి సంఘాలు కూడా నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment