ప్రత్యర్థి పార్టీ నేతలను ఉద్దేశించి నిత్యం ‘గూండాలు, రౌడీలు’ అంటూ ఉపన్యాసాలు దంచేసే హోంమంత్రి అనితకు.. సొంత పార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకులు చేస్తున్న అరాచకాలు అసలు కనిపిస్తున్నాయా లేదా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీస్ స్టేషన్లలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయి, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనే బూతులతో విరుచుకుపడుతుంటే ఏపీలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోందని ప్రజలు మండిపడుతున్నారు.
తిరుపతి రూరల్ పీఎస్‌లో..
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అనుచరులు చేసిన హంగామా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. లింగేశ్వరనగర్ పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు చిట్టి రాయల్ తల్లి హేమలత, ఆయన అనుచరుడు గిరిలు పోలీస్ స్టేషన్‌కు వచ్చి రచ్చరచ్చ చేశారు. పోలీసులకు సినిమా చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పోలీసులకే సస్పెన్షన్ వార్నింగ్
చవితి వేడుకల్లో బీరు బాటిళ్లతో దాడులు చేసుకున్న కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారిని విడిపించేందుకు స్టేషన్‌కు వచ్చిన టీడీపీ నేతలు హంగామా సృష్టించారు. తాను ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడినని, నేరుగా నారా లోకేష్ దగ్గరకే వెళ్లి పీఎస్‌లో ఉన్న అధికారులందరినీ సస్పెండ్ చేయిస్తానని గిరి అనే కార్యకర్త బహిరంగంగా బెదిరింపులకు దిగాడు.
‘యూనిఫామ్ ఉంది కాబట్టి బతికిపోయావ్’
విధి నిర్వహణలో భాగంగా ఈ దృశ్యాలను రికార్డు చేస్తున్న ఓ పోలీసుపైకి సదరు టీడీపీ కార్యకర్త కొట్టడానికి దూసుకెళ్లాడు. “యూనిఫాంలో ఉన్నావు కాబట్టి బతికిపోయావు.. లేదంటే ఇక్కడే నీకు సినిమా చూపించేవాళ్లం! కేసులు పెడితే పెట్టుకో.. చంద్రబాబుకు చెప్పినా భయపడేది లేదు” అంటూ స్టేషన్ లోపలే గట్టిగా అరుస్తూ పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడు.
పోలీసులకే రక్షణ లేదు..ఇది నిదర్శనం కాదా?
ప్రజా రక్షణ కోసం పనిచేసే పోలీసులకే రక్షణ లేకుండా పోయిన ఈ పరిస్థితిపై ప్రజలు, పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన చోటా నాయకులు సైతం లా అండ్ ఆర్డర్‌ను తమ చేతుల్లోకి తీసుకుంటుంటే, హోంమంత్రి అనిత దీనికి ఏం సమాధానం చెబుతున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా క్షీణించిందో చెప్పడానికి ఈ ఘటనే సజీవ నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు.
పోలీస్ స్టేషన్ అయితే ఏంటీ..? కేసు పెడతావా పెట్టుకో..
— Telugu Feed (@Telugufeedsite) September 24, 2026
యూనిఫాంలో ఉన్నావ్ కాబట్టి బతికిపోయావ్.. లేదంటే సినిమా చూపించే వాళ్లం
తిరుపతి రూరల్ పీఎస్‌లో @JaiTDP ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుల వీరంగం
పీఎస్‌లో టీడీపీ చోటా నాయకులు హంగామా.. పోలీసులకే హెచ్చరికలు
ఈనెల 20న… pic.twitter.com/lT5k8FYRL8








