ఖైరతాబాద్ గణేశుడి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివస్తున్న వేళ.. కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తోంది. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. కొంతమంది కావాలనే మహిళలపై తాకడం. వారిపై కావాలనే పైకి వెళ్లి పోవడంలాంటి వీడియోలు చూస్తున్నాం. ఈ తీరు చూస్తే దైవ భక్తి కోసం కాకుండా వేరే ఉద్దేశం తో వచ్చినట్లు ఉందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
వినాయకుడి దర్శనం కోసం వచ్చే ప్రతి ఒక్కరూ దైవ సన్నిధి పవిత్రతను గౌరవిస్తూ, ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా మహిళలను వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించకూడదని. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో పోలీసులు కొంతమందిని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. మహిళల భద్రత కోసం ఖైరతాబాద్ సహా రద్దీ ప్రాంతాల్లో షీ టీమ్స్ ప్రత్యేక నిఘా కొనసాగితున్నప్పటీకీ మరింత పటిష్ట భద్రత ఉండాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు.








