బిహార్‌లో మరో దారుణం.. మైనర్ బాలికపై వేధింపులు.. నలుగురు అరెస్ట్

బిహార్‌లో మరో దారుణం.. మైనర్ బాలికపై వేధింపులు.. నలుగురు అరెస్ట్

Summarize with AI

బిహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కర్పూరిగ్రామ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జగత్‌సింగ్‌పూర్‌ గ్రామంలో బండ్‌ బైపాస్‌ రోడ్డుపై ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాలిక ఓ మైనర్‌ బాలుడితో కలిసి బైక్‌పై అక్కడికి వచ్చిన సమయంలో కొందరు యువకులు వారిని అడ్డుకున్నట్లు సమాచారం. బాలుడిపై దాడి చేయడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోగా.. బాలికను చుట్టుముట్టి కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైరల్‌ వీడియోలో బాలిక వారి చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తోంది.

వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో సాంకేతికంగా పరిశీలించి ఘటనాస్థలాన్ని గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారిని వికాస్‌ కుమార్‌, రాహుల్‌ కుమార్‌, రాంబాబు సహ్ని, అవధేష్‌ పాస్వాన్‌గా గుర్తించారు. కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో చట్టం, ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వీడియోలో కనిపిస్తున్న బాలిక నాబాలిగగా ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో ఆమె వివరాలు బయటపెట్టవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment