తిరుమలలో రేపు VIP దర్శనాలు రద్దు

తిరుమలలో రేపు VIP దర్శనాలు రద్దు

Summarize with AI

ప్రతి సంవత్సరం జరిగే వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD). ఈ ఏడాది జనవరి 10 నుండి 19వ తేదీల వరకు వైకుంఠ ద్వార దర్శనాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇందుకు సంబంధించి, జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించబడనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం వల్ల ఆ రోజు VIP బ్రేక్ దర్శనాలు టీటీడీ రద్దు చేసింది. రేపు స‌ర్వ‌ద‌ర్శ‌నాలు మాత్ర‌మే ఉంటాయ‌ని, ఈ విష‌యాన్ని భ‌క్తులు గ్ర‌హించాల‌ని టీటీడీ తెలిపింది. అలాగే, టీటీడీ 6వ తేదీ నుండి సిఫార్సు లేఖలను స్వీకరించ‌డం లేద‌ని, ఈ విషయాన్ని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment