ఇది గాంధీభ‌వ‌న్ కాదు.. అసెంబ్లీలో ఎంఐఎం స‌భ్యులు ఫైర్‌

ఇది గాంధీభ‌వ‌న్ కాదు.. అసెంబ్లీలో ఎంఐఎం స‌భ్యులు ఫైర్‌

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నాలుగో రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఎంఐఎం (MIM) సభ్యులు వాకౌట్ చేశారు. స్పీకర్ సభను నడిపే తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు.

శాసనసభను ప్రభుత్వం చిత్త‌శుద్ధితో న‌డ‌ప‌డం లేద‌ని, సభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా? ఇది గాంధీభవన్ కాదు.. తెలంగాణ శాసనసభ్ణ అని ఎంఐఎం స‌భ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. గాంధీ‌భవన్ తరహాలో కాకుండా తెలంగాణ శాసనసభగానే అసెంబ్లీని న‌డ‌పాల‌ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

స‌భ‌లో ప్రశ్నోత్తరాల స‌మ‌యంలో కనీసం తమ పార్టీ స‌భ్యుల‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఒకవేళ ఇచ్చినా మాట్లాడుతుండగానే మైక్ కట్ చేస్తున్నారని, ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుండటం బాధాకరమని, సభలో సముచితమైన చర్చ జరగాలని, నియమ నిబంధనల మేరకు సభ ముందుకు సాగాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment