తెలుగు రాష్ట్రాలు స‌మైక్యంగా ఉండాలి – సీఎం చంద్ర‌బాబు

తెలుగు రాష్ట్రాలు స‌మైక్యంగా ఉండాలి - సీఎం చంద్ర‌బాబు

తెలుగు రాష్ట్రాలు (Telugu States) సమైక్యంగా ఉంటేనే తెలుగు జాతి (Telugu Community) పురోగతి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) అన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగే మన మాతృభాష అని, తెలుగు వారంతా ఐక్యతగా ముందుకు సాగితే ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభిస్తాయని అన్నారు.

గుంటూరులోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రం (Sri Sathya Sai Spiritual Centre)లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన సీఎం చంద్రబాబు, గోవా గవర్నర్ పి. అశోక్ గజపతి రాజు (Goa Governor P. Ashok Gajapathi Raju)తో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి (NTR Statue పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

తన ప్రసంగంలో చంద్రబాబు సాగునీటి అభివృద్ధిపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్టీఆర్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (United Andhra Pradesh)లో సాగునీటి రంగానికి బలమైన పునాది పడిందని గుర్తుచేశారు. సాగర్ జలాల వినియోగానికి ఎస్‌ఎల్‌బీసీ, ఎస్‌ఆర్‌బీసీ కాలువలు తీసుకురాగా, తన హయాంలో కల్వకుర్తి లిఫ్ట్, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను పూర్తి చేశానని తెలిపారు. కృష్ణా డెల్టా ఆధునీకరణతో నీటిని పొదుపు చేసి తెలంగాణ (Telangana)కు 20 టీఎంసీల నీటిని కేటాయించామని, గోదావరి నదిపై అలీసాగర్, దేవాదుల, పట్టిసీమ వంటి కీలక ప్రాజెక్టులు చేపట్టామని వివరించారు. ఏటా గోదావరి, కృష్ణా నదుల నుంచి వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతుండటాన్ని ప్రస్తావిస్తూ, నదుల అనుసంధానం అవసరమని అన్నారు.

మాతృభాష పరిరక్షణ మన అందరి బాధ్యత అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఘన చరిత్ర కలిగిన తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కడం మన గర్వకారణమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకు పైగా మంది తెలుగు మాట్లాడేవారుండటం, 40 దేశాల నుంచి ప్రతినిధులు ఈ మహాసభలకు రావడం ఆనందదాయకమన్నారు. భాష అనేది మన సంస్కృతిని, అస్తిత్వాన్ని కాపాడే శక్తి అని, ఏ భాష తక్కువ కాదు–ఎక్కువ కాదు అని వ్యాఖ్యానించారు. అమ్మతో సమానమైన మాతృభాషను గౌరవిస్తూ, తెలుగు భాష గొప్పదనాన్ని తరతరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదేనని ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment