పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project)కు అనుబంధంగా ఉన్న పోలవరం–బనకచర్ల (Polavaram–Banakacharla) లింక్ ప్రాజెక్ట్ పై మరోసారి వివాదం చెలరేగింది. ఏపీ ప్రభుత్వం తాజా టెండర్ నోటిఫికేషన్ పై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) కు అధికారికంగా లేఖ రాసింది.
తెలంగాణ ఇరిగేషన్ విభాగం ఇంజినీరింగ్ చీఫ్ (ENC) ద్వారా పంపిన లేఖలో “పోలవరం DPRకు విరుద్ధంగా ఈ ప్రాజెక్ట్ టెండర్ ఉందని” స్పష్టంగా పేర్కొంది. తాజా టెండర్ ప్రక్రియను తక్షణం రద్దు చేయాలని, అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన భూ సర్వే పనులను నిలిపివేయాలని సీడబ్ల్యూసీని తెలంగాణ విజ్ఞప్తి చేసింది.
“బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తే నీటి వినియోగంపై విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇది పోలవరం DPRలో పేర్కొన్న లక్ష్యాలకు విరుద్ధంగా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) భూ సర్వే లేదా టెండర్ ప్రక్రియలను కొనసాగించకుండా తక్షణం ఆపాల్సిందిగా కోరుతున్నాం” అని స్పష్టం చేసింది.
ఈ లేఖతో పోలవరం లింక్ ప్రాజెక్ట్‌పై మళ్లీ రాజకీయ చర్చలు వేడెక్కాయి. ఇప్పటికే నీటి పంపిణీ, ఆర్డీఎస్ అనుసంధానం వంటి అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు కొనసాగుతుండగా, ఈ తాజా అభ్యంతరంతో వివాదం మరింత ముదురనుంది.








సీటు త్యాగం చేసిన వర్మకు సొంత పార్టీలోనే ‘షాక్’