హైడ్రా కమిషనర్ (HYDRA Commissioner) రంగనాథ్‌కు (Ranganath) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాకిచ్చింది. ఈ మేరకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించి (Removing), ఆ స్థానంలో అర్హత కలిగిన ఐజీ స్థాయి అధికారిని (IG level Officer) నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని (State Government) ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కు(CS) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
హైడ్రాకు సంబంధించిన వ్యవహారాల్లో కోర్టు ఉత్తర్వుల అమలుపై దాఖలైన ధిక్కరణ కేసులను హైకోర్టు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. రంగనాథ్‌కు సంబంధించి 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
సెక్రటరీ ర్యాంకు స్థాయిలో (Secretary Rank Level) బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారి కోర్టు ఆదేశాలను (Court Orders) పాటించకుండా వ్యవహరించడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. వరుసగా వివాదాలు, కోర్టు ధిక్కరణ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం.. హైడ్రా కమిషనర్‌గా మరో అధికారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది.
ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. హైడ్రా చర్యలపై కొంతకాలంగా పలు వివాదాలు న్యాయస్థానం వరకు చేరుతున్న నేపథ్యంలో హైకోర్టు తాజా ఆదేశాలు తెలంగాణ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.








