స్వీడన్‌లోని ఓ స్కూల్‌లో కాల్పుల మోత.. 10మంది మృతి

స్వీడన్‌లోని ఓ స్కూల్‌లో కాల్పుల మోత.. 10మంది మృతి

Summarize with AI

స్వీడన్‌లోని ఒరెబ్రా నగర శివారులో ఉన్న ఓ పాఠశాలలో కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి స్కూల్‌లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10 మంది మరణించగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా మరణించినట్టు అధికారులు తెలిపారు. ఘటన సమయంలో విద్యార్థులు పరీక్షలు రాస్తుండటం భయానక పరిస్థితిని మరింత తీవ్రమైంది.

దర్యాప్తులో కొత్త కోణాలు
పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు ఉగ్రవాద సంబంధం ఉందా అనే కోణంలో విచారణ ప్రారంభించినప్పటికీ, ప్రాథమికంగా ఉగ్రవాద జాడలు లేవని నిర్ధారించారు. అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment