సూర్య మామూలు జోరు చూపించడం లేదు.. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న నడిపిన్ నాయగన్ ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేశాడు. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సూర్య.. గతంలో కంగువ, రెట్రో చిత్రాలతో ఎదురైన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. ప్రయోగాలు, మేకోవర్స్ కంటే కథ, కమర్షియల్ అంశాలకే ప్రాధాన్యం ఇస్తూ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ ఫార్ములా వర్కౌట్ కావడంతో వరుస విజయాలు అందుకుంటున్న సూర్య.. అదే జోరును కొనసాగిస్తూ హ్యాట్రిక్ హిట్ కోసం సిద్ధమవుతున్నాడు.
సూర్య 47వ సినిమాకు టైటిల్, రిలీజ్ డేట్ కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది. జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నవంబర్ 6న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమాలో సూర్య విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నట్లు సమాచారం. నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తుండగా, ప్రేమలు ఫేమ్ నస్లెన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాల తర్వాత ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడితే సూర్యకు మరో అరుదైన రికార్డు దక్కే అవకాశం ఉంది. అంతేకాదు.. ఈ చిత్రం రూ.200 కోట్ల మార్క్‌ను అందుకుంటే కోలీవుడ్‌లో మరో ప్రత్యేక రికార్డును సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. తమిళ, తెలుగు, మలయాళ దర్శకులతో వరుస విజయాలు సాధించే అరుదైన ఘనత కూడా సూర్య ఖాతాలో చేరుతుందా అనేది నవంబర్ 6న తేలనుంది.








