ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు (Sunny Leone) కర్ణాటక సీఐడీ (Karnataka CID) షాక్ ఇచ్చింది. భారీ ఆర్థిక కుంభకోణం (Financial Scam) కేసు దర్యాప్తులో భాగంగా ఆమెకు నోటీసులు జారీ చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. బెళగావికి (Belagavi) చెందిన ‘శివం అసోసియేట్స్’(Shivam Associates) సంస్థపై అక్రమంగా డిపాజిట్లు సేకరించి కస్టమర్లను మోసం చేసిన ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో సంస్థ యజమాని శివానంద నీలణ్ణవరపై (Shivanand Neelannavar) ఇప్పటికే కేసు నమోదవగా, అతడు నిర్మించిన ‘ఛాంపియన్’(Champion) సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సన్నీలియోన్‌కు రూ.1 కోటి పారితోషికం చెల్లించినట్లు సీఐడీ గుర్తించింది. ఈ చెల్లింపులు అక్రమ సొమ్ముతో జరిగాయా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.
సన్నీలియోన్‌తో పాటు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా సీఐడీ రాడార్‌లోకి (Radar) వచ్చారు. శివం అసోసియేట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కన్నడ ఉత్సవం’(Kannada Utsava])లో పాల్గొన్న నటులు డాలి ధనుంజయ్, వశిష్ఠ సింహ, సప్తమీ గౌడ, రాగిణి ద్వివేది తదితరులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి భారీ మొత్తంలో నగదు చెల్లింపులు జరిగాయనే అనుమానాలతో సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. త్వరలోనే ఈ సినీ ప్రముఖులను అధికారులు విచారించే అవకాశం ఉందని సమాచారం.








