శ్రీ‌కాళ‌హ‌స్తిలో గంజాయి బ్యాచ్‌.. హెడ్ కానిస్టేబుల్‌పై దాడి (Video)

శ్రీ‌కాళ‌హ‌స్తిలో గంజాయి బ్యాచ్‌.. హెడ్ కానిస్టేబుల్‌పై దాడి (Video)

Summarize with AI

రాష్ట్రంలో శాంతిభద్రతల(Law and Order) పరిరక్షణ పూర్తిగా గాడితప్పడానికే నిదర్శనమంటూ శ్రీకాళహస్తిలో(Srikalahasti) చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గంజాయిని(Ganja) పూర్తిగా నిర్మూలిస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందంటూ కూటమి ప్రభుత్వాన్ని(Coalition Government) నెటిజన్లు, ప్రజలు నిలదీస్తున్నారు. శ్రీకాళహస్తిలో గంజాయి మత్తులో యువకులు రెచ్చిపోతూ సామాన్యులపైనే కాకుండా ఏకంగా పోలీసు హెడ్ కానిస్టేబుల్‌పైనే(Police Head Constable) భౌతిక దాడికి దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ల్యాప్‌టాప్ చోరీ(Laptop Theft) ఫిర్యాదుపై శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్‌కు హెడ్ కానిస్టేబుల్ రమణయ్య(Ramanaiah) వెళ్లారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను ఆయన ప్రశ్నించగా, వారు రెచ్చిపోయి కానిస్టేబుల్ కాలర్(Collar) పట్టుకుని దాడికి పాల్పడటమే కాకుండా కత్తితో(Knife) బెదిరింపులకు దిగారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ గంజాయ్ బ్యాచ్ ఆగ‌డాలు త‌వ్వేకొద్దీ బ‌య‌ట‌ప‌డుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఎల్.ఐ.సి రోడ్‌లో జిమ్ నిర్వాహకుడు శివపై(Shiva) ఇదే గంజాయి బ్యాచ్ దాడికి పాల్పడింది. తీవ్ర గాయాలపాలైన శివ ప్రస్తుతం ఆస్పత్రిలో కోమాలో ఉంటూ పరిస్థితి విషమంగా ఉంది. స్కిట్ కాలేజీ రోడ్‌లో ఇళ్లల్లో నిలిపి ఉంచిన బైక్‌లను సైతం ఈ గంజాయి ముఠా చోరీ చేస్తూ స్థానికులనుభయభ్రాంతులకు గురిచేస్తోంది.

చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ ట్వీట్‌
ఈ ఘటనపై వైసీపీ(YSRCP) అధికారికంగా స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది. కూటమి ప్రభుత్వం చేతగానితనంతోనే శ్రీకాళహస్తిలో ఇష్టారీతిన గంజాయి, మద్యం అమ్మకాలు సాగుతున్నాయని ఆరోపించింది. మత్తులో గొడవ చేస్తున్న యువకులను వారించడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పైనే యువకులు కాలర్ పట్టుకుని భౌతిక దాడికి యత్నించడాన్ని తప్పుబట్టింది.

రాష్ట్రంలో ఏకంగా పోలీసులకే రక్షణ లేకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబును(Chief Minister Chandrababu) వైసీపీ నిలదీసింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ పూర్తిగా విఫలమైందని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గంజాయి బ్యాచ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment