టీడీపీ నేత అల్లుడి ఆగడాలు.. వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

టీడీపీ నేత అల్లుడి ఆగడాలు.. వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Summarize with AI

అధికార పార్టీ నేత‌, చంద్ర‌బాబు (Chandrababu) వీరాభిమాని బుద్ధా వెంకన్న(Budda Venkanna) అల్లుడు కాండ్రేగుల రవీంద్ర(Kandregula Ravindra) వేధింపుల (Harassment) కారణంగా ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. బెదిరించి త‌న వ‌ద్ద నుంచి రూ.5 కోట్లు తీసుకున్నాడ‌ని, బుద్ధా వెంక‌న్న అల్లుడి వ‌ల్ల‌ తాను సర్వనాశనమైపోయానని పేర్కొంటూ గట్టం సుమన్ (Gattam Suman) అనే బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం విజ‌య‌వాడ‌లో(Vijayawada) కలకలం రేపింది.

బుద్ధా వెంకన్న అల్లుడు కాండ్రేగుల రవీంద్ర తన వద్ద నుంచి బలవంతంగా, అన్యాయంగా రూ. 5 కోట్లు తీసుకున్నాడని సుమన్ వాపోయారు. తాను ఆర్యవైస్యుడినని నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. రవీంద్ర అరాచకాల వల్ల తాను సర్వనాశనం అయిపోయనని తెలిపారు. తన ఒంటిపై ఉన్న బంగారంతో పాటు, తన భార్య కిలో బంగారం, సింగినగర్ లోని స్థలాన్ని కూడా అమ్ముకున్నట్లు కన్నీరుమున్నీరయ్యారు.

తనకు తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు(Loans) చేసి మరీ బుద్ధా వెంకన్న అల్లుడికి భారీగా డబ్బులు సమర్పించుకున్నానని, ఇప్పటికే రూ. 5 కోట్లు ఇచ్చినప్పటికీ ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రెండో తరగతి, మూడో తరగతి చదివే చిన్న పిల్లలు ఉన్నారని, తాను డబ్బు, ఆరోగ్యం, కుటుంబాన్ని కోల్పోయి రోడ్డున పడ్డానని వాపోయారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు.

తన పరిస్థితిపై పోలీసులను(Police) ఆశ్రయించినప్పటికీ తనకు న్యాయం జరగలేదని, పోలీసులు తనకు చాలా గొప్పగా న్యాయం చేశారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతూ తన జీవితాన్ని నాశ‌నం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుని, తన కుటుంబానికి న్యాయం చేయాలని బాధితుడు గట్టం సుమన్ కన్నీటితో ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment