సిద్ధరామయ్య (Siddaramaiah) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తైన నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో సీఎం (Chief Minister) మార్పు ఊహాగానాలు జోరందుకున్నాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (D. K. Shivakumar) పవర్ షేరింగ్ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge), లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కీలక సమావేశం నిర్వహించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం మార్పుపై (CM Change) పార్టీ హైకమాండ్ (Party High Command) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక సిద్ధరామయ్యను మార్చితే ఓబీసీ (OBC) వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముందనే అభిప్రాయం కాంగ్రెస్‌లో (Congress) వ్యక్తమవుతోంది. మరోవైపు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని సిద్ధరామయ్య వర్గం చెబుతుండగా, గత మూడేళ్ల పాలనలో అమలు చేసిన హామీలు, ఉపఎన్నికల్లో సాధించిన విజయాలను ఆయన హైకమాండ్ ముందు ప్రస్తావించినట్లు సమాచారం. డీకే శివకుమార్ కూడా పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కర్ణాటకలో సీఎం కుర్చీపై కొనసాగేది సిద్ధరామయ్యేనా..? లేక కాంగ్రెస్ హైకమాండ్ కొత్త నిర్ణయం తీసుకుంటుందా..? అన్నదానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది.









సుగాలి ప్రీతి కేసును పవన్ రాజకీయానికి వాడుకున్నాడు