భార్గవ్ రెడ్డికి హైకోర్టులో ఊరట.. కేసు విచారణ వాయిదా

భార్గవ్ రెడ్డికి హైకోర్టులో ఊరట.. కేసు విచారణ వాయిదా

Summarize with AI

ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు.. ఈ సందర్భం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది.

భార్గ‌వ్ త‌ర‌ఫున పొన్న‌వోలు వాద‌న‌లు
సజ్జల భార్గవ్ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసు అసలు విచారణకు అర్హతలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోస్ట్ పెట్టిన వారే ఫిర్యాదు చేయలేద‌ని, మూడో వ్యక్తి కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదైందని వివ‌రించారు.

కఠిన చర్యలపై కోర్టు స్టే
కేసులో ఐటీ సెక్షన్ల స్థానంలో పోలీసులు నాన్-బెయిలబుల్ సెక్షన్లు పెట్టారని న్యాయ‌వాది పొన్న‌వోలు వాదించారు. పోలీసులు దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా చూపించడానికి ప్రయత్నించినా, ఇది అలాంటి నేరం కాదని అభిప్రాయపడ్డారు. పొన్న‌వోలు వాదనలను పరిగణలోకి తీసుకుంటూ, తదుపరి విచారణ వరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది.

Join WhatsApp

Join Now

Leave a Comment