రిజర్వేషన్లపై రాజకీయ వ్యూహం.. బాబుకు ముందే తెలుసా..?

రిజర్వేషన్లపై రాజకీయ వ్యూహం.. బాబుకు ముందే తెలుసా..?

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోలు న్యాయస్థానంలో నిలవకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బీసీల‌కు 34 శాతం రిజ‌ర్వేష‌న్ పిటిష‌న్‌ను సుప్రీం కోర్టు కొట్టేస్తూ సుప్రీంకోర్టు కీల‌క తీర్పు వెల్ల‌డించింది. బీసీలకు అధిక ప్రాతినిధ్యం కల్పిస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనలు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై చంద్ర‌బాబు స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల మొత్తం 50 శాతం పరిమితిని మించకుండా ఉండాలన్న న్యాయసూత్రాలను ప్రస్తావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, సుప్రీంకోర్టు సైతం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు తగిన ఆధారాలు, రాజ్యాంగబద్ధమైన సహేతుకతతోనే ఉందంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న రాజ్యాంగ ధర్మాసన తీర్పులు అమల్లో ఉన్నాయనేది దేశంలోనే సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉన్న చంద్ర‌బాబుకు తెలియ‌ద‌నుకోవ‌డం అమాయ‌క‌త్వ‌మే అవుతుంది. అయినా సరే, 34 శాతం రిజర్వేషన్ల ప్రకటన చేసి ఉత్తర్వులు ఇవ్వడం వెనుక కేవలం ప్రచారార్బాటమే ఉందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్ల జీవోలు జారీ చేసిన వెంటనే టీడీపీ శ్రేణులు చంద్రబాబును బీసీలకు మేలు చేసే నాయకుడిగా ప్రచారం చేశాయి. ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించాయి.

కోర్టులో జీవోలు నిలవకపోవచ్చని ముందే అంచనా వేసి, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీ ఓటర్లలో సానుభూతి పొందేందుకు ఈ నిర్ణయాన్ని ప్రచార అస్త్రంగా ఉపయోగించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. “మేము ఇచ్చాం కానీ కోర్టులే అడ్డుకున్నాయి” అని బీసీల ముందు నటిస్తూ సానుభూతి పొందడానికి చంద్రబాబు ముందస్తు ప్ర‌ణాళిక ఇది అంటూ విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

ఈ వ్యవహారాన్ని ప్రతిపక్ష వైసీపీపై రాజకీయ అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోందనే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. తాము బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావించినప్పటికీ వైసీపీ అడ్డుకుంద‌ని రేపు ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు త‌న అనుకూల మీడియాతో వార్తా క‌థ‌నాలు, టీవీ డిబేట్లు న‌డిపేందుకు చంద్ర‌బాబు ప్రభుత్వం ముందస్తు స్కెచ్ వేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment