ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో ఇమిటేషన్ జ్యువెలరీకి (Imitation Jewellery) భారీ డిమాండ్ ఉంది. పెళ్లిళ్లు(Weddings), పార్టీలకు (Parties మ్యాచింగ్‌గా ట్రెండీ డిజైన్లలో లభించే ఆర్టిఫిషియల్ నగలను (Artificial Jewellery) మహిళలు(Womens) ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఈ నగలు ధరించిన తర్వాత చాలా మందికి చర్మంపై (Skin) దురద(Itching), ఎర్రటి దద్దుర్లు (Red Rashes), మంట వంటి అలర్జీ(Allergy) సమస్యలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా నగల తయారీలో ఉపయోగించే నికెల్, ఇతర సింథటిక్ లోహాలు చర్మానికి తగలడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే ఈ ఇబ్బందులకు సులభంగా చెక్ పెట్టొచ్చు.
ఆర్టిఫిషియల్ నగలు ధరించే ముందు ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్(Transparent Nail Polish) ఉపయోగించడం చాలా మంచి చిట్కా. నగల వెనుక భాగంలో అంటే చర్మానికి తగిలే వైపున క్లియర్ నెయిల్ పాలిష్ (Clear Nail Polish) ఒక కోటింగ్‌లా వేయాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత నగలు ధరించడం వల్ల లోహం నేరుగా చర్మాన్ని తాకదు. దీంతో అలర్జీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. అలాగే నగలు వేసుకునే ముందు మెడ(Neck)లేదా చెవుల (Ears) దగ్గర మంచి మాయిశ్చరైజర్ (Moisturizer) లేదా బాడీ లోషన్ (Body Lotion) రాయడం వల్ల చర్మంపై రక్షణ పొర ఏర్పడుతుంది. చెమట ఎక్కువగా వచ్చే వారికి టాల్కమ్ పౌడర్ (Talcum Powder) కూడా మంచి ఉపశమనం ఇస్తుంది.
ఇంకా నగల శుభ్రత విషయంలో కూడా జాగ్రత్తలు చాలా అవసరం. చాలా మంది వాడిన తర్వాత నగలను అలాగే పెట్టేస్తారు. దీంతో వాటిపై చెమట, దుమ్ము చేరి తరువాతి సారి వేసుకున్నప్పుడు చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రతి సారి వాడిన తర్వాత నగలను మెత్తని కాటన్ క్లాత్‌తో తుడిచి, గాలి తగిలేలా ఉంచి భద్రపరచాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చర్మ అలర్జీల భయం లేకుండా మీకు నచ్చిన ఇమిటేషన్ జ్యువెలరీని స్టైలిష్‌గా ధరించి మెరిసిపోవచ్చు.








