బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకో.. – రేవంత్‌కు కిషన్ రెడ్డి కౌంట‌ర్‌

బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకో.. - రేవంత్‌కు కిషన్ రెడ్డి కౌంట‌ర్‌

తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర ప్రాజెక్టుల అనుమతులు, నిధుల విషయంలో కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిది పేజీల బహిరంగ లేఖతో కౌంటర్ ఇచ్చారు.

ప్రధాన ఆరోపణలు..
ఆర్‌ఆర్‌ఆర్‌, మూసీ, మెట్రో ఫేజ్‌-2, హైదరాబాద్ సివరేజ్, వరంగల్ అండర్ గ్రౌండ్ సివరేజ్ వంటి ప్రాజెక్టుల కోసం కేంద్రాన్ని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అనుమతులు, నిధులు మంజూరు చేయకపోవడం కేంద్రం నిర్లక్ష్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని విమర్శించారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టును కిషన్ రెడ్డే అడ్డుకున్నారు అని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి ఐదు ప్రధాన ప్రాజెక్టులకు అనుమతులు తెస్తే కిషన్ రెడ్డిని ఊరూరా ప్రచారం చేస్తా, సన్మానం చేస్తా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

సవాల్ విసిరిన కేంద్ర మంత్రి
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి ఆరోపణలు నిరాధారమైనవ‌ని కిషన్ రెడ్డి అన్నారు. తాను మెట్రో ప్రాజెక్టును అడ్డుకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నాడ‌ని, నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే నిరూపించాలి అంటూ రేవంత్‌కు సవాల్ విసిరారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకోవాలని, సీఎం స్థాయి వ్యక్తి అవగాహన లేక మాట్లాడుతున్నారు అంటూ విమర్శించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఈ వివాదం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment