అబద్ధాల పునాదులపై రేవంత్‌ సీఎం అయ్యారు: బండి సంజయ్

అబద్ధాల పునాదులపై రేవంత్‌ సీఎం అయ్యారు: బండి సంజయ్

అబ­ద్దాల పునాదులపైనే రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి సీఎం అయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. మహిళలంద­రికీ ప్రతినెలా రూ.2500 ఇస్తానని మోసం చేశా­రని, తులం బంగారం, స్కూటీ పేరుతో నిలువు­నా ముంచారని, మహిళా బిల్లును అడ్డుకుని దక్షి­ణాదికి తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ తరహాలోనే అబద్దాలు, మోసాలతోనే పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.

నిజాయి­తీ­గా పనిచేసే నాయకులపై బురద చల్లడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. ప్రతి రాష్ట్రానికి 50 శాతం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెంచి దక్షిణాదికి న్యా­యం చేయాలని మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెడితే ఇండియా కూటమి నేతలు బిల్లును అడ్డుకున్నా­ర­న్నారు. మహిళా బిల్లును అడ్డుకోవడంలో రేవంత్‌ కీలక పాత్ర పోషించారన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment