వివాదం పుట్టించి.. మళ్లీ చర్చించేది మీరేనా..?

వివాదం పుట్టించి.. ఆ త‌ర్వాత చ‌ర్చిస్తారా..?

రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్‌ (Rayalaseema Lift Irrigation)పై అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్య‌ల‌తో వివాదం రాజుకుంది. ”రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపాలని నేను అడిగా, చంద్రబాబు (Chandrababu Naidu) ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆపించా, క్లోజ్ రూమ్‌లో నేను చంద్రబాబుని అడిగా, నా మీద గౌరవంతో చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు, కావాలంటే దీనిపైన నిజానిర్ధారణ కమిటీని పంపండి” అంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ మాట్లాడారు. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదం రాజుకుంది.

రేవంత్‌రెడ్డి ఇంత ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చినా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) దీనిపై నోరు కూడా మెద‌ప‌లేదు. వారం రోజులు అయినా రేవంత్ స్టేట్‌మెంట్‌ను చంద్ర‌బాబు ఖండించ‌లేదు. అటు తెలుగుదేశం పార్టీ కూడా అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌క‌పోవ‌డం శోచ‌నీయం. దీంతో కూట‌మి ప్రభుత్వ తీరుతో రాయలసీమవాసుల్లో తీవ్ర ఆందోళన వ్య‌క్తం అవుతోంది.

అయితే రాయ‌ల‌సీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ ద్వారా, సీమ‌లోని ఉమ్మ‌డి నాలుగు జిల్లాల‌తో పాటు నెల్లూరు రైతాంగానికి ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని వైసీపీ వాదిస్తోంది. రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌తో అడ్డంగా దొరికిపోయిన కూట‌మి ప్రభుత్వం వైసీపీ(YSRCP)పై ఎదురుదాడికి దిగిందనే విమ‌ర్శ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ విడుద‌ల చేసిన లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్ట్ విజువ‌ల్స్ రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల్లో మ‌రింత న‌మ్మ‌కాన్ని నింపాయి. దీంతో సీమ ప్ర‌జ‌ల నుంచి ఆగ్ర‌హావేశాలు తీవ్ర‌మ‌య్యాయి. అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి ఉందాం.. క‌లిసి పెరిగాం.. క‌లిసి అభివృద్ధి చెందుదాం అని వైఎస్ జ‌గ‌న్ తెలంగాణ ప్ర‌భుత్వాన్ని విజ్ఞ‌ప్తి చేశారు.

దీంతో ఇరు రాష్ట్రాల‌ ముఖ్య‌మంత్రులు శాంతి చ‌ర్చ‌ల రాగం పాడుతున్నారు. ప‌క్క రాష్ట్ర సీఎంకి విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. మేం వివాదం కోరుకోవ‌టం లేదు అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ వెంట‌నే తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌రిగిన స‌భ‌లో “నాకు గొడవలు వద్దు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. గొడవల వల్ల ఎవరికీ ఎలాంటి లాభం ఉండదు. మన వద్ద నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా వాడుకోవచ్చు” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

నీళ్ల విష‌యంలో రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చంద్ర‌బాబు పేరు ప్ర‌స్తావిస్తూ చేసిన వ్యాఖ్య‌ల‌తో వివాదం రాజుకుంది. తెలంగాణ సీఎం వ్యాఖ్య‌ల‌పై అధికార తెలుగుదేశం పార్టీ గానీ, ఏపీ సీఎం చంద్ర‌బాబు గానీ ఎలాంటి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో వివాదం తీవ్ర‌మైంది. వివాదం సృష్టించిన వారే.. ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త తీవ్ర‌మ‌వ్వ‌డంతో చ‌ర్చ‌లు అంటూ కొత్త రాగం పాడుతున్నార‌ని, డ్రైవ‌ర్ష‌న్‌లో ఇదొక భాగ‌మ‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఇంత‌కీ రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్ట్‌ను కూట‌మి ప్ర‌భుత్వం కంటిన్యూ చేస్తుందా..? లేక రేవంత్ చెప్పిన‌ట్లుగా ప్రాజెక్ట్ ఆగిపోతుందా..? అని సీమ ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment